Krishna District: స్వీట్ షాపులో పనికి వెళ్లి.. లాడ్జీలో అపస్మారక స్థితిలో.. చికిత్స పొందుతూ మృతి.. అంతా మిస్టరీ

హనుమాన్‌ జంక్షన్‌లో ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Krishna District: స్వీట్ షాపులో పనికి వెళ్లి.. లాడ్జీలో అపస్మారక స్థితిలో.. చికిత్స పొందుతూ మృతి.. అంతా మిస్టరీ
Women death
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 18, 2021 | 7:59 AM

Crime News: హనుమాన్‌ జంక్షన్‌లో ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒంటరిగా ఉంటున్న మహిళ లాడ్జీలో చనిపోవడంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రేప్‌ జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కే సీతారామపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఏడు సంవత్సరాల క్రితం వివాహం అయింది. కొద్ది రోజుల తర్వాత భర్తతో గొడవల కారణంగా ఒంటరిగా ఉంటోంది. ఆరు సంవత్సరాల పాపతో కలిసి హనుమాన్‌ జంక్షన్‌లో నివాసం ఉంటుంది. జీవనోపాధి కోసం హనుమాన్‌ జంక్షన్‌లోని ఓ స్వీట్‌ షాపులో పని చేస్తోంది. రోజు వారీగానే స్వీట్‌ షాప్‌కు వెళ్లిన మహిళ హనుమాన్‌ జంక్షన్‌లోని ఓ లాడ్జీలో అపస్మారక స్థితిలో కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకొని కే సీతారామపురానికి చెందిన మహిళగా గుర్తించారు. అయితే ఒంటిపై తీవ్ర గాయాలు ఉండడంతో స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించారు. అయితే.. పరిస్థితి విషయమించడంతో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దీంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. అనుమాన స్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఇంతకు ఈ మహిళ హనుమాన్‌ జంక్షన్‌లోని లాడ్జీకి ఎందుకు వెళ్లింది? లాడ్జీకి ఎవరు తీసుకెళ్లారు? ఎన్ని రోజుల క్రితం లాడ్జీకి వెళ్లారు? మహిళ వెంట ఎంత మంది ఉన్నారు? వారంతా తెలిసిన వాళ్లేనా? ఎవరైనా కొత్త వారు ఉన్నారా? ఇంతకు మహిళపై గ్యాంగ్‌ రేప్‌ ఏమైనా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం డెడ్‌బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహిళ చనిపోయిన లాడ్జీ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అన్న కోణంలో సీసీ కెమెరాల విజువల్స్‌ను చూస్తున్నారు. కొంత కాలంగా మహిళ స్వీట్‌ షాపులో పని చేస్తుండడంతో.. షాపు యజమానికి ఏమైనా సంబంధం ఉందా.. అన్న కోణంలో కూడా కూలీ లాగుతున్నారు పోలీసులు.

Also Read: Photo Gallery: ఆ చిన్నారి ఒంటరిగా నవ్వుతోంది, ఏడుస్తోంది.. అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ చూస్తే షాక్

Babita phogat Sister: ఓటమిని భరించలేక ‘దంగల్‌ సిస్టర్‌’ ఆత్మహత్య.. ఒక్క పాయింట్ తేడాతో మ్యాచ్‌ ఓడిపోవడంతో..