- Telugu News Photo Gallery Viral photos Woman left terrified after spotting mysterious figure standing over grandchilds bed
Photo Gallery: ఆ చిన్నారి ఒంటరిగా నవ్వుతోంది, ఏడుస్తోంది.. అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ చూస్తే షాక్
ఇది అచ్చం సినిమాల్లో చూసే లాంటి సంఘటనే.ఆ చిన్న పాప రోజూ కనిపించని వ్యక్తితో మాట్లాడుతోంది. ఆటలు కూడా ఆడుతుంది. ఈ క్రమంలో పాప గ్రాండ్ మదర్‌కు అనుమానం కలిగింది. ఆమె ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలనే ఉత్కంఠతో గదిలోకి సీసీటీవీ పుటేజ్ చూసింది.. అంతే షాక్....
Updated on: Mar 17, 2021 | 9:48 PM

లాస్ వెగాస్‌లో టారీ మెక్కెంజీ అనే మహిళ మనవరాలు అంబర్ కొన్ని రోజులుగా వింతగా ప్రవర్తిస్తుంది. తనలో తానే మాట్లాడుకుంటుంది..ఏడుస్తుంది..నవ్వుతుంది. దీంతో కంగారుపడ్డ ఆ చిన్నారి గదిలోనీ సీసీటీవీ కెమేరాలో రికార్డైన ఫుటేజ్ చెక్ చేసింది. కానీ, అందులో ఏమి కనిపించలేదు. ఆ తర్వాత కూడా పాప ప్రవర్తనలో మార్పు రాలేదు. కొన్నాళ్ల తర్వాత మరోసారి సీసీ ఫుటేజ్ చెక్ చేయగా అందులో దృష్యం చూసి ఆమె షాక్‌కు గురైంది.

ఆ వీడియో ఫూటేజ్‌లో చిన్నారి బెడ్ పక్కన విచిత్రమైన ఆకారం కనిపించింది. ఆ విచిత్ర వ్యక్తి తలపై కొమ్ములు, చేతికి పొడవాటి గోళ్లు ఉన్నాయి. దీంతో ఆమె ఆ వీడియోల స్క్రీన్ షాట్లను తీసి పారానార్మల్ పరిశోధకులకు పంపింది.

మా ఇంట్లో వింతలు జరుగుతున్నాయ్. ఒకసారి మాకు ఓ పురుషుడి గొంతు వినిపించింది. కర్టెన్లు కూడా దానికవే మూసుకుని తెరుచుకొనేవి. ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలా జరిగాయ్ అని మెక్కెంజీ వెల్లడించారు.

నాకు ఫొటోషాప్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. జనాల అటెన్షన్ పొందే ఉద్దేశం కూడా నాకు లేదు. అందుకే వీటిని పరిశోధకులకు పంపానని ఆమె చెబుతోంది.

పారానార్మల్ పరిశోధకులు ప్రస్తుతం ఆ ఫుటేజ్‌పై శోధన మొదలెట్టారు. లోతైన అధ్యాయనంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇది షాకింగ్ సంఘటనే.




