Crime News Telangana: నీటి పారుదల శాఖ ఆఫీస్‌లో పని చేస్తున్న అధికారి.. అతగాడి చేతివాటం మీరే చూడండి

అక్కడే మద్యం బాటిల్‌ కొన్నాడు.. ఆ పక్కనే పూటుగా తాగేశాడు. అతనెవరో కాదు..ఓ బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్నాడు. ఐనా సరే తన చిల్లర బుద్ది పోనిచ్చుకోని..

Crime News Telangana: నీటి పారుదల శాఖ ఆఫీస్‌లో పని చేస్తున్న అధికారి.. అతగాడి చేతివాటం మీరే చూడండి
Govt Oficer Theft
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 18, 2021 | 8:27 AM

అక్కడే మద్యం బాటిల్‌ కొన్నాడు.. ఆ పక్కనే పూటుగా తాగేశాడు. అతనెవరో కాదు..ఓ బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్నాడు. ఐనా సరే తన చిల్లర బుద్ది పోనిచ్చుకోని ఆ వ్యక్తి ఏం చేశాడో వింటే షాక్‌ తినాల్సిందే.

వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో పట్ట పగలే ఓ బెల్ట్‌ షాపులో చోరీ జరిగింది. దొంగ తనం చేసింది ఎవరో కాదు.. ఓ ప్రభుత్వ ఉద్యోగి. అంతే కాదు.. చోరీకి ముందే అదే షాపులో మద్యం బాటిల్‌ కొనుగోలు చేసి పూటుగా తాగాడు. పూటుగా తాగిన మైకంలో ఏమి చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యక్తి కౌంటర్‌ను నుంచి క్యాష్‌ ఎత్తుకెళ్లాడు. ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. స్థానికంగా ఉన్న నీటి పారుదల శాఖ ఆఫీస్‌లో పని చేస్తున్న అధికారి శ్రీనివాస్‌రెడ్డి.. మండల కేంద్రంలోని ఓ బెల్ట్‌ షాపులో మద్యం బాటిల్‌ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అక్కడే మద్యం తాగాడు. మత్తు కిక్‌ ఇచ్చే విధంగా బాటిల్‌ మీద బాటిల్‌ కొట్టేశాడు. సోయిలేని స్థితికి చేరుకున్న తర్వాత.. బెల్ట్‌ షాపులో దొంగతనం చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చాడు. మెళ్లిగా షాపులోకి వెళ్లిన శ్రీనివాస్‌ రెడ్డి.. క్యాష్‌ కౌంటర్ నుంచి డబ్బులు తీసుకొని అక్కడి నుంచి జారుకున్నాడు. ఇతతంగం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇక్కడ మరో ట్విస్ట్‌ కూడా ఉంది. ఆన్‌ డ్యూటీలో పట్టపగలే మద్యం తాగడమే కాకుండా.. ఇలా చోరీకి పాల్పడి కెమెరాకు చిక్కాడు.

Also Read: Photo Gallery: ఆ చిన్నారి ఒంటరిగా నవ్వుతోంది, ఏడుస్తోంది.. అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ చూస్తే షాక్

Babita phogat Sister: ఓటమిని భరించలేక ‘దంగల్‌ సిస్టర్‌’ ఆత్మహత్య.. ఒక్క పాయింట్ తేడాతో మ్యాచ్‌ ఓడిపోవడంతో..