AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Building Collapsed: ప్లాష్ న్యూస్.. గజ్వేల్‌ పట్టణంలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. క్షణాల్లో అంతా అయోమయం..

Building Collapsed: తెలంగాణ‌లోని సిద్దిపేటల జిల్లా గజ్వేల్‌ పట్టణంలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సంతోష్ థియేటర్..

Building Collapsed: ప్లాష్ న్యూస్.. గజ్వేల్‌ పట్టణంలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. క్షణాల్లో అంతా అయోమయం..
Building Collapsed
Shiva Prajapati
|

Updated on: Mar 18, 2021 | 8:37 AM

Share

Building Collapsed: తెలంగాణ‌లోని సిద్దిపేటల జిల్లా గజ్వేల్‌ పట్టణంలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సంతోష్ థియేటర్ పక్కనే ఉన్న ఈ భవనం అర్థరాత్రి దాటిన తరువాత అంటే తెల్లవారు జామున 3 గంటల సమయంలో కూలిపోయింది. అయితే బిల్డింగ్ కూలడానికి ముందే భారీగా శబ్ధాలు రావడంతో అందులో ఉన్న వారు అలర్ట్ అయి బిల్డింగ్ నుంచి బయటకు పరుగులు తీశారు. వారు అలా బయటకు రావడమే ఆలస్యం పేకమేడలా బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘనటలో బిల్డింగ్ వాచ్‌మెన్‌కు స్వల్ప గాయాలు మినహా.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనలో దాదాపు 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇదిలాఉంటే.. బిల్డింగ్ కూలిన సమయంలో భారీగా శబ్ధాలు రావడంతో చుట్టు పక్కన వారు కూడా భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బిల్డింగ్ కుప్పకూలడంపై ఇంటి యజమానులను, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read:

Crime News Telangana: నీటి పారుదల శాఖ ఆఫీస్‌లో పని చేస్తున్న అధికారి.. అతగాడి చేతివాటం మీరే చూడండి

బండి సంజయ్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్‌ అసోసియేషన్‌ గుస్సా.. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటన

భర్తకు తెలియకుండా రెండు సార్లు అబార్షన్ చేయించుకున్న భార్య.. ఆగ్రహించిన భర్త ఏం చేశాడంటే..