భర్తకు తెలియకుండా రెండు సార్లు అబార్షన్ చేయించుకున్న భార్య.. ఆగ్రహించిన భర్త ఏం చేశాడంటే..

Aborting Pregnancy: ఇష్టం లేకుండా పెళ్లి చేశారనే కారణంతో ఓ మహిళ తన భర్తకు తెలియకుండా రెండు సార్లు అబార్షన్..

  • Shiva Prajapati
  • Publish Date - 8:15 am, Thu, 18 March 21
భర్తకు తెలియకుండా రెండు సార్లు అబార్షన్ చేయించుకున్న భార్య.. ఆగ్రహించిన భర్త ఏం చేశాడంటే..
Fir Filed

Aborting Pregnancy: ఇష్టం లేకుండా పెళ్లి చేశారనే కారణంతో ఓ మహిళ తన భర్తకు తెలియకుండా రెండు సార్లు అబార్షన్ చేయించుకుంది. ఈ ఘటన చండీగఢ్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండీగఢ్‌లోని ముండియన్ కలాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి 2019, నవంబర్ 24 ఓ మహిళతో వివాహం జరిగింది. అయితే ఆతనితో పెళ్లి సదరు మహిళకు అస్సలు ఇష్టం లేదు. అయితే, వివాహం జరిగిన తరువాత మహిళ రెండు సార్లు గర్భవతి అయ్యింది. కానీ, అతనితో పెళ్లి ఇష్టం లేని సదరు మహిళ.. భర్తకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రెండుసార్లు అబార్షన్ చేయించుకుంది. విషయం తెలుసుకున్న భర్త.. తన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అబార్షన్ చేయించుకోవడంపై నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇలా నిత్యం వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దాంతో ఇక లాభం లేదనుకున్న భర్త.. తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన అనుమతి లేకుండానే తన భార్య రెండు సార్లు అబార్షన్ చేయించుకుందంటూ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. అంతేకాదు.. తన తల్లిదండ్రులు విడిచి వేరు కాపురం పెట్టాలంటూ వేధిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించిన పోలీసులు.. అతని ఆరోపణలు వాస్తవం అని గుర్తించి ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు అతని భార్య కూడా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు అతన్ని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని, బలవంతంగా పెళ్లి చేసుకున్నారని ఆరోపించింది. అయితే, సదరు మహిళపై పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 315 కింద కేసు నమోదు చేశారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. తనకు తెలియకుండా రెండు సార్లు అబార్షన్ చేయించుకున్న మహిళకు ఆమె భర్త ఇప్పటికే విడాకులు ఇచ్చాడు.

Also read:

Life Insurance Policy: ఏ వయసులో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటే మంచిది.. టర్మ్‌ పాలసీల ద్వారా పన్ను రాయితీ

Krishna District: స్వీట్ షాపులో పనికి వెళ్లి.. లాడ్జీలో అపస్మారక స్థితిలో.. చికిత్స పొందుతూ మృతి.. అంతా మిస్టరీ