Telangana MLC Election Results 2021:పెద్దల పోరులో కారు జోరు.. హైదరాబాద్, నల్గొండ స్థానంలో పల్లా హోరు.. రెండో రౌండ్‌లోనూ దూకుడు..
పెద్దల పోరులో కారు జోరు కొనసాగుతోంది. హైదరాబాద్, నల్గొండ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసే..
Telangana (Hyderabad) Graduate Elections Counting: పెద్దల పోరులో కారు జోరు కొనసాగుతోంది. హైదరాబాద్, నల్గొండ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 7871 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డికి 15857 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు 12070 ఓట్లు, కోదండరాంకు 9448 ఓట్లు, బీజేపీకి 6669 ఓట్లు, కాంగ్రెస్‌కు 3244,రాణిరుద్రమకు 1634, చెరుకుకి 1330, జయసారధికి 1263 ఓట్లు వచ్చాయి. అలాగే చెల్లనివి ఓట్లు 3009 పోలయ్యాయి.
మొదటి రౌండ్‌లో సత్తా చాటిన పల్లా.. రెండో రౌండ్‌లోనూ అదే రిపీట్ చేస్తున్నారు. సెకండ్ రౌండ్‌లో మొత్తం 56వేల 3 ఓట్లలో .. పల్లాకు 15 వేల 857 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 12 వేల 70 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. థర్డ్ ప్లేస్‌లో కోదండరామ్‌కు 9,448 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6,669 ఓట్లతో ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి పల్లా 3,787 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఖమ్మం- వరంగల్- నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి పల్లాకు 16వేల 130 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థికి 12వేల 46 ఓట్లు.. కోదండరామ్‌కు 9వేల 80 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి నాలుగు, కాంగ్రెస్ క్యాండెట్ రాములు నాయక్ ఐదో స్థానంలో కొనసాగారు. రెండో రౌండ్‌లోనూ మళ్లీ పల్లానే ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం 3 లక్షల 85వేల 996 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఏడు రౌండ్లలో వెలువడనున్న ఈ ఫలితాల్లో.. ఓక్కో రౌండ్‌లో 56,000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. ఫస్ట్, సెకండ్ రౌండ్లలో 56 వేల 3 ఓట్లను లెక్కించారు. దాదాపు నాలుగువేల చెల్లని ఓట్లను అధికారులు గుర్తించి పక్కనపడేశారు.
మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానం మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 17 వేల 429 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 16,385, ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుకు 8,357, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 5,101 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవి సమీప బీజేపీ అభ్యర్థిపై వెయ్యి 44 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం ఎనిమిది హాళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఒక్కో హాల్‌లో ఏడు టేబుళ్లు, ఒక్కో టేబుల్‌లో వెయ్యి ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం ఏడు రౌండ్లలో లెక్కింపు నిర్వహించనుండగా.. ఒక్కో రౌండ్‌లో 56వేల ఓట్లు కౌంట్ చేస్తున్నారు. ఒక్కో రౌండ్‌కి దాదాపు నాలుగు గంటలు సమయం పడుతుంది. మూడు షిప్టుల్లో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు.