బడ్జెట్‌తో అసెంబ్లీకి చేరుకున్న ఆర్థిక మంత్రి.. అంతకు ముందు ఆ దేవాలయాన్ని దర్శించుకున్న హరీశ్‌రావు
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీకి చేరుకున్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలతో కూడిన బడ్జెట్‌ను మంత్రి..
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీకి చేరుకున్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలతో కూడిన బడ్జెట్‌ను మంత్రి కాసేపట్లో సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీ హీల్స్ లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధమ బ్రహ్మోత్సవాలలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
మంత్రి హరీశ్ రావు ఇవాళ ఉదయం 11.30 గంటలకు శాసన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో 2021-22 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ప్రజలందరికి మంచి జరగాలని, సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పేదల సంక్షేమం కోసం, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు.
వేంకటేశ్వరా స్వామివారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ బడ్జెట్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నిరకాలుగా మేలు చేస్తుందనే సంపూర్ణమైన విశ్వాసం ఉందని చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు మంచికలగాలని, గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేద వర్గాల సంక్షేమానికి ని, ప్రభుత్వం ప్రజలకుఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకునేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కృషి చేశామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నూతనంగా జరుగుతన్న ప్రథమ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్తులతో ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని అన్నారు.
అయితే కరోనా కష్టకాలం తరువాత రూపుదిద్దుకున్న బడ్జెట్ కావడంతో.. ఈ బడ్జెట్ ఏ రకంగా ఉంటుందనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బడ్జెట్‌లో ఏయే అంశాలు ఉంటాయనే దానిపై కూడా సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు.
పలు సంక్షేమ పథకాలకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయింపు ఉంటుందనే అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు రాజకీయంగా కాస్త ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో.. ఈసారి బడ్జెట్ ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి కరోనా సంక్షోభ కాలం తరువాత ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ద్వారా సీఎం కేసీఆర్ ప్రజలను ఏ రకంగా మెప్పిస్తారో చూడాలి.
Read More:
బీజేపీ ఎంపీ ప్యాలెస్‌లో చోరీ.. రాణి మహల్‌లో దూరిన దొంగలు.. స్నిపర్ డాగ్స్‌తో పోలీసుల దర్యాప్తు
రెండు చోట్లా గెలిచాడు.. చివరికి ఎక్కడా కాకుండా పోయాడు.. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన
మార్చి 24 నుంచి 28 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. ఆర్జితసేవలు రద్దు -టీటీడీ