AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR speaking Assembly : రైతులకు వంద శాతం రుణమాఫీ చేస్తాం.. ఉభయ సభలనుద్ధేశించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

CM KCR Speaking in The Assembly : మార్చి 18వ తేదీన రాష్ట్ర బడ్జెట్ సెషన్ సందర్భంగా.. బుధవారం గవ‌ర్నర్ చేసిన‌‌ ప్రసం‌గా‌నికి

CM KCR speaking Assembly : రైతులకు వంద శాతం రుణమాఫీ చేస్తాం.. ఉభయ సభలనుద్ధేశించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
Cm Kcr Speaking
Follow us
uppula Raju

|

Updated on: Mar 17, 2021 | 3:57 PM

CM KCR Speaking in The Assembly : మార్చి 18వ తేదీన రాష్ట్ర బడ్జెట్ సెషన్ సందర్భంగా.. బుధవారం గవ‌ర్నర్ చేసిన‌‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ర్టంలోని రైతుల‌కు రుణ‌మాఫీ వంద‌కు 100 శాతం చేసి తీరుతామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ర్టంలో ఉచిత 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు. వ‌ర‌ద కాల్వ మీద వంద‌ల‌, వేల మోటార్ల‌ను పెట్టుకునే వారు. కాక‌తీయ కాల్వ మీద కూడా వేల మోటార్లు పెట్టుకున్న‌ప్ప‌టికీ.. వాటి వ‌ద్ద‌కు వెల్లొద్ద‌ని క‌రెంట్ అధికారుల‌కు తాను సూచించాన‌ని తెలిపారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి న‌క్క‌కు, నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. నాడు 128 ఎక‌రాల్లో పాలీ హౌజ్‌లు ఉంటే.. ఇప్పుడు 1300 ఎక‌రాల్లో ఉన్నాయి. స‌బ్సిడి కూడా 75శాతం ఇస్తున్నామని, 6 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు డ్రిప్ ప‌రిక‌రాలు పంపిణీ చేశామ‌ని తెలిపారు.పెద్దపెల్లి అడ్వకేట్ హత్య చాలా దారుణం. అందులో ఇన్వాల్ అయిన టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడిని సస్పెండ్ చేశామన్నారు. దోషులు ఎవరైనా విడిచిపెట్టేది లేదన్నారు.

మార్చి 18న బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం రోటీన్ ప్రాసెస్‌లో బడ్జెట్‌కు సభ ఆమోదం తీసుకుంటారు. ఆ తర్వాత అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదంతో ఉభయ సభలు వాయిదా పడతాయి. మార్చి 26వ తేదీ వరకు చట్ట సభల బడ్జెట్ సమావేశాలు కొనసాగనుండగా.. చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లు (అప్రాప్రియేషన్ బిల్లు) ఆమోదం కోసం కేటాయించారు.