Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిందూ మహాసముద్రంలో కొన్ని వేల అడుగుల లోతున ఏమిటా విచిత్ర జీవి ? షేపులు మార్చుకుంటున్న ‘ఏలియన్’ ?

సముద్ర గర్భాల్లో అత్యంత లోతైన చోట్ల మనకు తెలియని ఎన్నో విచిత్రాలు, అద్భుతాలు జరుగుతుంటాయి. విచిత్రమైన సముద్ర జీవులు,  రకరకాల జాతులు, కొన్ని (జంతు సంబంధ) ఛానెళ్లకు సైతం అందని మిస్టీరియస్ వండర్స్ కి కొదవే ఉండదు.

హిందూ మహాసముద్రంలో కొన్ని వేల అడుగుల లోతున ఏమిటా విచిత్ర జీవి ? షేపులు మార్చుకుంటున్న 'ఏలియన్' ?
Strange Creature In Indian Ocean
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 17, 2021 | 5:52 PM

సముద్ర గర్భాల్లో అత్యంత లోతైన చోట్ల మనకు తెలియని ఎన్నో విచిత్రాలు, అద్భుతాలు జరుగుతుంటాయి. విచిత్రమైన సముద్ర జీవులు,  రకరకాల జాతులు, కొన్ని (జంతు సంబంధ) ఛానెళ్లకు సైతం అందని మిస్టీరియస్ వండర్స్ కి కొదవే ఉండదు. రీసెర్చర్లకు, జంతు నిపుణులకు సైతం ఇవి అంతు బట్టవు.    ఉదాహరణకు హిందూ మహాసముద్రంలో సుమారు  3,700  అడుగుల లోతున మనం కనీవినీ ఎరుగని విచిత్ర జీవి కనబడి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. రకరకాలుగా షేపులు మారుస్తూ, అతి వేగంగా మరీ లోతుగా నీటి అడుగు భాగానికి వెళ్లి అక్కడ తన ఆకారాన్ని మార్చుకుని మళ్ళీ పైకి లేచిన  వెంటనే తన షేపు మారుస్తూ వచ్చిన స్ట్రేంజ్ క్రియేచర్ ని యేమని పిలవాలో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొందరు దీన్ని సముద్ర  ‘ఏలియన్’ అని అంటే మరికొందరు ఇది చేప లేదా తిమింగలం జాతికి చెందిన కొత్తరకం జీవి అంటున్నారు.  కొంతమంది జేమ్స్ కేమరూన్ మూవీ ‘ఏలియన్’ ని గుర్తు చేస్తున్నారు. ఇది నీటిలో సుమారు 40 సెకండ్ల పాటు ఒకేచోట తేలుతూ చటుక్కున కిందికి వెళ్లి చిన్న నల్లని బాల్ రూపంలోకి మారడం,   ఆ తరువాత పుష్పం లా విచ్చుకుని తిరిగి పైకి లేవడం.. ఇలా రకరకాల విన్యాసాలు చేయడాన్ని ఇంత లోతున రీసెర్చర్లు అమర్చిన కెమెరా క్యాప్చర్ చేసింది.

సముద్రంలో 3,753 అడుగుల లోతున రిమోట్ లీ ఆపరేటెడ్ ‘వెహికల్’ సాయంతో ఈ జీవి తాలూకు దృశ్యాలను వీడియోగా  తీశారు.  ఇది 2013 నాటిదైనా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాటి నుంచి నేటివరకు ఈ విచిత్ర జీవి ఏమిటో, దీని పర్వాపరాలేమిటో చెప్పలేక పోతున్నారు.  యూట్యూబ్ లో లక్షన్నర మంది దీన్ని వీక్షించారు. వారి ఆసక్తికి అంతులేకుండా పోతోంది.  దీన్ని గుర్తు పట్టడానికి అనేకమంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.  సముద్రాల్లో అతి లోతైన చోట్ల ఈ విధమైన విచిత్ర జీవాలు ఇంకా ఎన్ని ఉన్నాయో అని శాస్త్రజ్ఞులు తర్జన భర్జన పడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ‘నన్ను నాడు సీపీఎం వారు కొట్టారు, ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తోంది’, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

‘గాడ్ అన్నా గన్స్ అన్నా ఇష్టం,’ జార్జియా కాల్పుల కేసు అనుమానితుడి వెల్లడి, ఆసియా మహిళలనే టార్గెట్ చేశాడట