Sarah Taylor: క్రికెట్‌లో చరిత్ర మారుతుంది.. అబ్బాయిల క్రికెట్ జట్టుకు కోచ్‌గా శివంగిలాంటి అమ్మాయి

క్రికెట్‌ చరిత్రలో నూతన అధ్యాయం తెరలేవనుంది. ఇంగ్లాండ్‌ మెన్స్ జట్టుకు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా సారా జనీ టేలర్ వ్యవహరించనున్నారు.

Sarah Taylor: క్రికెట్‌లో చరిత్ర మారుతుంది.. అబ్బాయిల క్రికెట్ జట్టుకు కోచ్‌గా శివంగిలాంటి అమ్మాయి
Sarah Taylor
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 17, 2021 | 5:30 PM

క్రికెట్‌ చరిత్రలో నూతన అధ్యాయం తెరలేవనుంది. ఇంగ్లాండ్‌ మెన్స్ జట్టుకు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా సారా జనీ టేలర్ వ్యవహరించనున్నారు. ఇప్పటికే  ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.  పురుషుల జట్టుకు మహిళ కోచ్‌ను కేటాయించడం ఇదే మొదటి సారి. ససెక్స్ జట్టుకు కీపింగ్‌ కోచ్‌గా  సారాటేలర్‌ పనిచేయనున్నారు.  2017లో ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌లో ఆడిన సారా..  ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇంగ్లండ్‌ తరపున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ 20లు ఆడిన సారా 2019లో క్రికెట్‌ కు గుడ్‌బై చెప్పింది.  మొత్తం 104 స్టంపింగ్స్ చేసిన సారా‌, 128లు క్యాచ్‌లు అందుకుంది. అటు బ్యాట్‌తో కూడా మంచి ప్రదర్శన చేసి..  వన్డేల్లో 4,056, టీ20ల్లో 2177 పరుగులను సాధించింది.

సారా జనీ టేలర్   మే20, 1989న సారా జేన్ టేలర్ జన్మించింది.  ససెక్స్ జట్టు కోసం ఆమె కౌంటీ క్రికెట్ ఆడింది. వెల్లింగ్టన్, సౌత్ ఆస్ట్రేలియా, అడిలైడ్ స్ట్రైకర్స్, లాంక్షైర్ థండర్, సర్రే స్టార్స్ తరుఫున ఆడి మంచి ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. స్ట్రోక్ ఆటకు ప్రసిద్ది చెందిన వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఖ్యాతి గడించింది.  పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో బ్యాటింగ్ ప్రారంభించిన టేలర్, టెస్ట్ క్రికెట్‌లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసింది.

2012, 2013లో సారా టీ20 ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది.  2014 లో ఐసిసి ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది.  2015లో ఆస్ట్రేలియాలో పురుషుల గ్రేడ్ క్రికెట్ ఆడిన మొదటి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది.  మే 2016 ఆందోళనతో బాధపడుతున్నట్లు ప్రకటించి.. కెరీర్ ను కాపాడుకోవడం కోసం ఆట నుంచి తాత్కాలిక విరామం తీసుకుంది.  ఏప్రిల్ 2017 లో తిరిగి ఆడటం ప్రారంభించింది.  2017 జూన్ ఉమెన్స్ క్రికెట్ ప్రపంచ కప్‌కు ఎంపికైంది.  టామీ బ్యూమాంట్ తో కలిసి మహిళల క్రికెట్ లో అరుదైన రికార్డు నెలకొల్పింది సారా.  ప్రపంచ కప్ చరిత్రలో (275) అత్యధిక 2 వ వికెట్ భాగస్వామ్య రికార్డును లిఖించింది. ఇంగ్లాండ్‌లో జరిగిన 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో గెలిచిన మహిళా జట్టులో టేలర్ సభ్యురాలు. జూలై 2019లో ఆమె ఆటనుంచి శాశ్వతంగా రిటైర్మెంట్ ప్రకటించింది.

Also Read:

చిత్తూరు జిల్లాలో ఇంకా గసగసాల స్మెల్.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.. డ్రగ్ తయారికి దీన్ని ఎలా వినియోగిస్తారంటే..?

Vakeel Saab Review: సినిమా బ్లాక్ బస్టర్, పవన్ ఈజ్ బ్యాక్… ఫస్ట్ రివ్యూ చెప్పేసిన ఆ క్రిటిక్