బెంగాల్ ఎన్నికలు , పురూలియాలో బీజేపీ ‘రథ వాహనం’ ధ్వంసం, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల పనేనని కమలనాథుల ఆరోపణ
బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అప్పుడే పాలక తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. మంగళవారం పురూలియా జిల్లాలో టీఎంసీ ఎంపీ అభిషేక్ ముఖర్జీ తన ర్యాలీని ముగించి వెళ్లిన కొద్దిసేపటికే బీజేపీకి చెందిన 'రథ వాహనం' (బస్సు) పూర్తిగా ధ్వంసమైంది.
బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అప్పుడే పాలక తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. మంగళవారం పురూలియా జిల్లాలో టీఎంసీ ఎంపీ అభిషేక్ ముఖర్జీ తన ర్యాలీని ముగించి వెళ్లిన కొద్దిసేపటికే బీజేపీకి చెందిన ‘రథ వాహనం’ (బస్సు) పూర్తిగా ధ్వంసమైంది. ఈ వాహన డోర్ అద్దాలన్నీ పగిలి చెల్లా చెదురుగా పడిపోయాయి. ఇది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల పనేనని, అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్ర వహించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ జిల్లాల్లో 9 నియోజకవర్గాల్లో ప్రచార యాత్రను ముగించుకుని ఈ వాహనం తిరిగి పురూలియా చేరగానే ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ గాయపడ్డాడని బీజేపీ నేత అమిత్ మాలవీయ తెలిపారు. ఇది పూర్తిగా టీఎంసీ వర్గీయులు తప్ప మరెవరూ ఈ దాడి చేసి ఉండరని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు.దీనికి కారకులైనవారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బీజేపీ అభ్యర్థి గౌరీ సింగ్ సర్దార్ తో బాటు ఈ పార్టీ కార్యకర్తలంతా రోడ్డుపై రాస్తా రోకో ఆందోళన ప్రారంభించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇలా ఉండగా..బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పక్షంలో ప్రజా హక్కులను రద్దు చేస్తుందని, రాష్ట్రంలోని అన్ని బ్యాంకులను మూసివేస్తుందని సీఎం, టీఎంసీ నేత మమతా బెనర్జీ హెచ్చరించారు. బెంగాల్ లో ప్రచారం కోసం బీజేపీ కేంద్ర మంత్రులంతా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీ వారి బస్సు ఘటనకు, తమ పార్టీకి సంబంధం లేదని ఆమె అన్నారు. బీజేపీ వారు తమ వాహనాలను తామే ధ్వంసం చేసుకుంటారని ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించారు. బంకూరాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో కూడా ఆమె బీజేపీ నేతలపై విరుచుక పడ్డారు. తనను చంపడానికి వారు కుట్ర పన్నుతున్నారని, తృణమూల్ కాంగ్రెస్ ని నాశనం చేయడానికి యత్నిస్తున్నారని ఆమె అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి: డీహెచ్‌ఎల్‌తో సంప్రదింపులు జరుపుతున్న ఇండియన్ పోస్ట్.. మరిన్ని దేశాలకు స్పీడ్ పోస్ట్ సేవలను పెంచే దిశగా..
చంద్రబాబు నిజాయితీ కోర్టుల్లో నిరూపించుకో.. సవాల్ విరిసిన ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి