AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు నిజాయితీ కోర్టుల్లో నిరూపించుకో.. సవాల్ విరిసిన ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి

చంద్రబాబు, లోకేష్ తీరుతో ప్రజలు విసుగు చెందారని చంద్రబాబు తన హయాంలో అన్ని పేర్లతో దోచుకున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

చంద్రబాబు నిజాయితీ కోర్టుల్లో నిరూపించుకో.. సవాల్ విరిసిన ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి
Gadikota Srikanth Reddy Challenge
Balaraju Goud
|

Updated on: Mar 16, 2021 | 7:56 PM

Share

Gadikota srikanth reddy challenge : ఎంపీటీసీ జడ్పీటీసీల్లో ఏకగ్రీవాల పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని టీడీపీ డిమాండ్ చేయాలన్న ఆయన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టిన టీడీపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. చంద్రబాబు తన భాషను మార్చుకోవాలని అన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘంపై తమకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు, కక్ష సాధింపులు లేవన్న ఆయన కరోనా సమయంలోనూ ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి విధుల్లో పాల్గొన్నారని కితాబు ఇచ్చారు. కరోనా సమయంలో ఎన్నికలు వద్దంటే, పార్టీ భయపడుతోందని విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాలతో జనం టీడీపీకి బుద్ది చెప్పారన్నారు

చంద్రబాబు, లోకేష్ తీరుతో ప్రజలు విసుగు చెందారని చంద్రబాబు తన హయాంలో అన్ని పేర్లతో దోచుకున్నారని అయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేయడంపై కోర్టులను అవమానపరిచేలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, చంద్రబాబుకు దమ్ముంటే కోర్టుల్లో స్టేలు వేకెట్ చేయించుకోవాలని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. అలానే వచ్చిన ఆరోపణలపై విచారణకు ఒప్పుకోవాలని అన్నారు.

ఈవీఎంలను దొంగతనం చేసిన చరిత్ర టీడీపీదన్న ఆయన అమరావతి ప్రాధాన్యత తగ్గించాలని సీఎం జగన్ ఎప్పుడూ ప్రయత్నం చేయలేదన్నారు. అమరావతి సహా అన్ని ప్రాంతాలను సీఎం అభివృద్ధి చేస్తారన్న ఆయన ప్రాంతాల వారీగా చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల్లో వైసీపీ మీద నమ్మకమే గెలిపించిందని అన్నారు. మూడు రాజధానులకు ప్రజలు మద్దతు తెలిపారని, కర్నూలులో న్యాయ రాజధాని పెడతాంటే నాలుగు జిరాక్స్ షాపులు కూడా రావని చంద్రబాబు అవమానించారని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం తెలిసిన వ్యక్తి అని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల మాదిరిగా, ప్రతి ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఈ 21 నెలల పాలనలో అనేక ప్రజా సంక్షేమ పథకానలు అమలు చేశామన్నారు. టీడీపీకి అధికారం యావ తప్ప వేరే లేదన్న ఆయన.. అధికారం అంటే, ఏం చేయకపోయినా చేసినట్లు ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. కానీ, మేమే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని వాటిని కూడా అమలు చేసి చూపిస్తున్నామన్నారు. కోవిడ్‌ సమయంలో దేశంలోనే అత్యుత్తమంగా సేవలు అందించామని, అందుకే ప్రజల విశ్వాసాన్ని పొందామని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు.

ఇదీ చదవండిః  కేరళ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. ఎన్‌సీపీలో చేరిన మాజీ ఎంపీ పిసి చాకో.. ఎల్‌డిఎఫ్ తరుపున ప్రచారం