మళ్లీ పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. ఆ తరగతులకు స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలు.. విద్యాశాఖ ఆదేశాలు
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతుంది. దేశంలో తగ్గినట్టే తగ్గిన వైరస్.. కొన్ని రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో పలు రాష్ట్రాల్లో..
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతుంది. దేశంలో తగ్గినట్టే తగ్గిన వైరస్.. కొన్ని రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో పలు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఓ పక్క కరోనా వ్యిక్సినేషన్ జరుగుతుండగానే మహమ్మారి కోరలు చాస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో మళ్లీ రెడ్‌జోన్ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి.
యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మొదటి దశను విజయవంతంగా ఎదుర్కున్న భారత్‌లో రెండో దశ బలంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తయ్యాయి. కరోనా నేపథ్యంలో అన్‌లైన్ క్లాస్‌లకే పరిమితమైన విద్యాసంస్థలు కొంతకాలంగా హైక్లాస్ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్నాయి.
అయితే విద్యా సంస్థల్లో విద్యార్థుకలు కరోనా సోకుతుండటంతో కర్ణాటక సర్కార్ అప్రమత్తమైంది. కర్నాటకలో విజృంభిస్తున్న కోవిడ్-19 కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు పలు నిబంధనలు జారీ చేసింది. అయితే వీటిని ఉల్లంఘిస్తూ 1 నుంచి 5వ తరగతి వరకూ క్లాసులు నిర్వహిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కర్నాటక విద్యాశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కర్నాటక రాష్ట్రప్రభుత్వం 1 నుంచి 5 వ తరగతి వరకూ కేవలం ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. అయితే కొన్ని పాఠశాలలు ఈ నిబంధనను ఉల్లంఘించి 1 నుంచి 5వ తరగతి వరకూ ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కాగా ఇటీవల కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ ఒక ట్వీట్‌లో…. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా 1 నుంచి 5 వ తరగతి వరకూ పాఠశాలలు తెరవవద్దని కోరారు.
కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక తరగతులు నిర్వహిస్తున్నారంటూ తమకు ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ప్రాథమిక తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి వాటిపై చర్యలు చేపడుతున్నారు.
Read More:
జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ.. కృష్ణా నదీజలాల వివాదంపై తెలంగాణ తరపు సాక్షుల హాజరు
పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు.. తిరుపతిలో ఐదోరోజు కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు