సాయుధ పోరాటం వదిలి శాంతిమంత్రం… మావోయిస్టుల కొత్త రూట్.. ఎందుకో.. మరెందుకో…!

ల్యాండ్‌ ఆఫ్ మైన్స్‌గా చెప్పుకొనే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నిర్ణయం హాట్‌టాపిక్‌ అవుతోంది. సాయుధ పోరాటాన్ని వదిలి ఒక్కసారిగా శాంతిమంత్రం జపించడంపై చర్చలు...

సాయుధ పోరాటం వదిలి శాంతిమంత్రం... మావోయిస్టుల కొత్త రూట్..  ఎందుకో.. మరెందుకో...!
Maoists Preparing For Talks
Follow us

|

Updated on: Mar 17, 2021 | 1:59 PM

Maoists Preparing For Talks: ల్యాండ్‌ ఆఫ్ మైన్స్‌గా చెప్పుకొనే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నిర్ణయం హాట్‌టాపిక్‌ అవుతోంది. సాయుధ పోరాటాన్ని వదిలి ఒక్కసారిగా శాంతిమంత్రం జపించడంపై చర్చలు మొదలయ్యాయి. మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్‌ పేరిట విడుదలైన ప్రకటనలో… ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో చర్చలు సిద్ధమన్నారు.

3 షరతులతో పీస్‌ టాక్స్‌ జరపాలన్న డిమాండ్‌ ప్రభుత్వం ఎదుట ఉంచారు మావోయిస్టులు. దండకారణ్యంలో సాయుధ దళాలను తొలగించాలని… మావోయిస్టు సంస్థపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని… జైళ్లలో ఉన్న తమ నేతలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల శ్రేయస్సు కోరుతూ వేసిన ముందడుగు వేశామని…. గవర్నమెంట్‌ కూడా సపోర్ట్ చేసి… చర్చలకు అవసరమైన ఎట్మాస్పియర్‌ ప్రిపేర్ చేయాలని మావోయిస్టులు సూచించారు.

మావోయిస్టులు తీసుకున్న చర్యను ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్ ఆహ్వానించారు. ఇది చాలా హ్యాపీగా ఫీల్‌ కావాల్సిన న్యూస్‌ అని అభిప్రాయపడ్డారాయన. ఈ ఆఫర్‌పై ప్రభుత్వం ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రపంచంలో ఏ సమస్య కూడా బులెట్‌తో పరిష్కారం కాలేదంటూ ఆయన ఇటీవల కాలంలో చేసిన స్టేట్‌మెంట్‌ ఆయన గుర్తు చేశారు.

ఇదంతా దృష్టి మరల్చే టాక్టీస్ అంటున్నారు పోలీసు అధికారులు. కొంతకాలంగా దండకారణ్యంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని… పోలీసులదే పైచేయి అవుతుందంటున్నారు. క్రమంగా బలహీన పడుతున్న మావోయిస్టులు మరో కొత్త ఎత్తుగడతోనే చర్చలంటున్నారని అనుమానిస్తున్నారు.

మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలు పోలీసుల ఆధీనంలోకి వచ్చాయి. దీంతో కేడర్‌ను రక్షించుకొని… కొత్త రిక్రూట్‌మెంట్‌ల కోసం మావోయిస్టులు శాంతి చర్చ చేస్తున్నారని వాదన పోలీసు వర్గాల్లో ఉంది. చాలా ప్రాంతాల్లో ప్రజల్లోనూ మార్పు వచ్చిందని… మావోయిస్టులకు సహకరించేందుకు జనం ముందుకు రావడం లేదంటున్నాయి భద్రతా బలగాలు. వారంతా పోలీసులకు సహకరించడం మావోలకు బొత్తిగా ఇష్టంలేదని… తమను మోరల్‌గా దెబ్బతీసేందుకే ఏదో కొత్త ప్లాన్ వర్కవుట్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చర్చలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు సామాజిక కార్యకర్త ప్రొఫెసర్‌ హరగోపాల్‌. కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నా కేంద్రంలో ఉన్న బీజేపీ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉండదంటున్నారాయన. ఛత్తీస్‌గఢ్‌లో పౌరు సమాజం లేకపోవడం కూడా నెగిటివ్‌ ఇంపాక్ట్‌ పడుతుందన్నారు హరగోపాల్‌.

చర్చలకు ప్రభుత్వం ఓకే చెప్పిన తర్వాత జరిగే పరిణామాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయన్న చర్చ కూడా నడుస్తోంది. 2004 ఏపీ ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య జరిగిన చర్చల అంశాన్ని చాలామంది ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో చర్చలు విఫలమయ్యాయని… తర్వాత మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీన పడిన విధాన్ని అంతా గుర్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Rs.10 Biryani: ఘుమ ఘుమలాడే హైదరాబాదీ బిర్యానీ రూ.10కే.. ఎక్కడో తెలుసా..! విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొత్త భయం.. దడ పుట్టిస్తున్న కరోనా.. హాట్‌స్పాట్స్‌గా గురుకుల పాఠశాలలు..