AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొత్త భయం.. దడ పుట్టిస్తున్న కరోనా.. హాట్‌స్పాట్స్‌గా గురుకుల పాఠశాలలు..

Increasing Covid-19: స్కూల్‌లో కరోనా దడ పుట్టిస్తోంది. బడి పేరు చెబితేనే తల్లిదండ్రులు, విద్యార్థుల్లో భయం మొదలవుతోంది. ఇంతకీ స్కూల్‌లో వైరస్‌ సోకడానికి కారణమేంటి... నెగెటివ్ రిపోర్టుతో స్కూళ్లకు..

విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొత్త భయం.. దడ పుట్టిస్తున్న కరోనా.. హాట్‌స్పాట్స్‌గా గురుకుల పాఠశాలలు..
Students Test Positive For
Sanjay Kasula
|

Updated on: Mar 17, 2021 | 11:49 AM

Share

Students Test Positive For Covid : స్కూల్‌లో కరోనా దడ పుట్టిస్తోంది. బడి పేరు చెబితేనే తల్లిదండ్రులు, విద్యార్థుల్లో భయం మొదలవుతోంది. ఇంతకీ స్కూల్‌లో వైరస్‌ సోకడానికి కారణమేంటి… నెగెటివ్ రిపోర్టుతో స్కూళ్లకు వెళ్లి విద్యార్థులు ఒక్కసారిగా కరోనా బారిన ఎలా పడతారు… అసలు స్కూల్‌కి కరోనా ఎలా పాకింది. దీనిపై ఎన్నికల ప్రభావం ఎంత ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో కరోనా హాట్‌స్పాట్స్‌గా గురుకుల పాఠశాలలు మారుతున్నాయి. ఈ స్కూల్స్‌లో సిబ్బంది బయటకు వెళ్లి వస్తుంటారు. వంట చేసేవాళ్లు, హెల్పర్లు అంతా బయట ఊళ్ల నుంచి వెళ్లి వస్తుంటారు. అందులో ఒకరికి వ్యాధి ఉన్నా… మిగిలిన వాళ్లకు సోకే ప్రమాదం ఉంది. ఇలా వెళ్లి వచ్చిన వాళ్లలో చాలా మందికి కనీసం జాగ్రత్తలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు కూడా ఊళ్లకు వెళ్తుంటారు. అలా వెళ్లి వచ్చిన వారికి ఎలాంటి టెస్ట్‌లు లేకుండానే తరగతుల్లో కూర్చోబెట్టడం… సిబ్బందిని తరగతులు చెప్పేందుకు, పనులు చేసేందుకు అనుమతి ఇస్తున్నారు. ఈ ఎఫెక్ట్‌తోనే ఇప్పుడు తెలంగాణలో కరోనా డేంజర్‌బెల్స్ మోగిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ మాస్కులు పెట్టుకోవడం… ఫిజికల్స్ డిస్టెన్స్‌ పాటించకపోవడం… సానిటైజేషన్ లేకపోవడంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. గత కొన్ని రోజులుగా కేసులు తగ్గడం… వ్యాక్సిన్‌ వచ్చేసిందన్న నిర్లక్ష్యంతో చాలా మంది ఆజాగ్రత్తగా ఉంటున్నారు. ఇదే కరోనా కేసులు పెరగడానికి కారణవుతోంది.

కనీస జాగ్రత్తలు పాటించకపోవడం ఒక రీజన్‌ అయితే… ఇటీవలే రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి ఎలాంటి పరీక్షలు చేయకుండానే స్కూల్స్‌కు పంపించేశారు. ఇప్పుడు వీళ్లే కరోనా వ్యాధి కారకులుగా ఉన్నరేమో అన్న అనుమానం కలుగుతోంది.

తెలంగాణలోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు ఆరు జిల్లాల ఉపాధ్యాలు హాజరయ్యారు. వీళ్లకు ఎలాంటి పరీక్షలు చేయకుండానే క్లాసెస్‌ చెప్పేందుకు అనుమతి ఇచ్చారు. కరోనా వ్యాప్తికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు వైద్యులు.

ఇలాంటి చిన్నచిన్న తప్పులు కారణంగానే నిన్న ఒక్కరోజులు తెలుగు రాష్ట్రాల్లో వందకుపైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ వ్యాధి బారినపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా మలికీపురం యూపీ స్కూల్‌లో 24 కేసులు కొత్తగా గుర్తించారు. తెలంగాణలోని మంచిర్యాల, కామారెడ్డి, నాగోల్‌లో వందకుపైగా కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయి.

విజృంభిస్తున్న కరోనా కేసుల సంగతి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు ఉండే స్కూల్స్‌కు, హాస్టల్స్‌కు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. భయాన్ని పోగొట్టేందుకు వీడియో కాల్స్‌ ద్వారా స్టూడెంట్స్‌తో తల్లిదండ్రులను మాట్లాడిస్తున్నారు. ప్రత్యేక టీమ్‌తో మానిటరింగ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. నెగెటివ్‌ వస్తే విద్యార్థులను ఇంటికి పంపుతామని ప్రిన్సిపాల్స్‌ ధైర్యం చెబుతున్నారు.

స్కూల్‌ సిబ్బందిపై తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌కు పంపించేటప్పుడు నెగటివ్‌ రిపోర్టుతో పంపించామని…. ఇప్పుడు ఎలా పాజిటివ్‌ వచ్చిందని నిలదీస్తున్నారు. సురక్షితమైన ప్లేస్‌లో కరోనా ఎలా స్ప్రెడ్‌ అయిందని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని బోరుమంటున్నారు.

ఇవి కూడా చదవండి

Rs.10 Biryani: ఘుమ ఘుమలాడే హైదరాబాదీ బిర్యానీ రూ.10కే.. ఎక్కడో తెలుసా..! Golconda Murder: హైదరాబాద్‌ గోల్కొండలో దారుణం.. అన్నను దారుణంగా హత్య చేసిన తమ్ముడు.. ఆస్తి వివాదాలే కారణమా..?

AP MLC Election Results 2021 LIVE: మొదలైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. రాత్రికి తొలి రౌండ్​ ఫలితం!