AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Golconda Murder: హైదరాబాద్‌ గోల్కొండలో దారుణం.. అన్నను దారుణంగా హత్య చేసిన తమ్ముడు.. ఆస్తి వివాదాలే కారణమా..?

Golconda Murder:హైదరాబాద్‌ గోల్కొండలో దారుణం చోటు చేసుకుంది. షేక్‌పేట నాలా పక్కనే విజయ్‌ అనే వ్యక్తిని తమ్ముడు నరేందర్‌ దారుణంగా హత్య చేశాడు. అయితే షేక్‌పేట్‌కు చెందిన విజయ్‌, నరేందర్‌ ఇద్దరు అన్నదమ్ములు. గత కొద్ది రోజులుగా..

Golconda Murder: హైదరాబాద్‌ గోల్కొండలో దారుణం.. అన్నను దారుణంగా హత్య చేసిన తమ్ముడు.. ఆస్తి వివాదాలే కారణమా..?
Golconda Murder
Subhash Goud
|

Updated on: Mar 17, 2021 | 9:05 AM

Share

Golconda Murder:హైదరాబాద్‌ గోల్కొండలో దారుణం చోటు చేసుకుంది. షేక్‌పేట నాలా పక్కనే విజయ్‌ అనే వ్యక్తిని తమ్ముడు నరేందర్‌ దారుణంగా హత్య చేశాడు. అయితే షేక్‌పేట్‌కు చెందిన విజయ్‌, నరేందర్‌ ఇద్దరు అన్నదమ్ములు. గత కొద్ది రోజులుగా వీరిద్దరి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు కొనసాగుతున్నట్లు గోల్కొండ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో విజయ్‌ పై తమ్ముడు దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడంతో విజయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇక హత్య చేసిన తర్వాత నిందితుడు నరేందర్‌ అక్కడి నుంచి పారిపోయినట్లు సీఐ వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ హత్యలో నిందితుడే ఒక్కడే ఉన్నాడా..?లేక ఇంకేవరైన సాయం చేశారా..? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

Gurgaon Crime News : వాటాల మధ్య తేడాలు.. పాట్నరే కిడ్నాప్ చేసి చితక్కొట్టాడు.. ఈ గ్రూప్‌లో ఓ మహిళ కూడా..

Bhainsa ASP Kiran : తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. బైంసా ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి కిరణ్ నియామకం..

ఫ్లోరిడాలో కారుపైకి దూసుకు వెళ్లిన సింగిల్ ఇంజన్ విమానం, ఇద్దరి మృతి, వాహనంలోని తల్లీ బిడ్డలకు తీవ్ర గాయాలు వీడియో