ఏపీలో ఆ సంచలన నిర్ణయానికి గవర్నర్‌ ఆమోదముద్ర.. ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన బీబీ హరిచందన్

వైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేతబట్టిన నాటి నుంచి పలు సంస్కరణలు చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం జగన్‌ మరో సంచలన..

ఏపీలో ఆ సంచలన నిర్ణయానికి గవర్నర్‌ ఆమోదముద్ర.. ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన బీబీ హరిచందన్
Jagan
Follow us
K Sammaiah

| Edited By: Ravi Kiran

Updated on: Mar 17, 2021 | 1:22 PM

వైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేతబట్టిన నాటి నుంచి పలు సంస్కరణలు చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం జగన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎంలుగా ఐదుగురికి అవకాశం కల్పించి సంచలనం రేపారు. తాజాగా అదే కోవలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అత్యధిక పంచాయలీలు, మున్సిపాల్టీలను గెలుచుకుని తన బలాన్ని నిరూపించుకుంది.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైఎస్ చైర్మన్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం పంపారు. ఇద్దరు డిప్యూటీ మేయర్ లు, వైస్ చైర్మన్ ల ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేయర్ల ఎంపిక జరగనుంది. ఈలోనూ గవర్నర్‌ ఆమోదం తెలపడంతో ఇక నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, చైర్మన్‌ల విధానం అధికారికంగా అమల్లోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లోనూ ఇదే ఫార్ములా కొనసాగుతుంది. ఇప్పటికే సామాజిక సమీకరణాలతో ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించారు సీఎం జగన్. ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ అదే ఫార్ములాను అమలు చేస్తున్నారు.

ఏపీ వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపాలిటీల విషయాలకు వస్తే.. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది. మైదుకూరు, తాడిపత్రిల్లో మాత్రం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఖాతాలో చేరాయి. అయితే ఆ రెండు చోట్ల కూడా ఎక్స్ అఫిషియో సభ్యుల బలంతో చైర్మన్ గిరిని సొంతం చేసుకుంటామని వైసీపీ ధీమాగా ఉంది. దీంతో ఆ రెండు చోట్ల క్యాంపు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

వైసీపీ గెలిచిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులపై నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. దీంతో కొంతమంది అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎంపికతో సమాజిక వర్గాల లెక్కన అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అలాగే అందరికీ సమ న్యాయం చేసే పరిస్థితి ఉంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. ప్రభుత్వం ఫార్ములాను త్వరగానే అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

Read More:

రాష్ట్రంలో వ్యక్తుల హక్కులకు రక్షణ లేదు.. అందుకే ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం -యనమల

లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు.. ప్రభుత్వ, పార్టీల వ్యయం తగ్గుతుంది.. పార్లమెంటరీ ప్యానెల్‌ నివేదిక

మళ్లీ పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. ఆ తరగతులకు స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలు.. విద్యాశాఖ ఆదేశాలు ‌