AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tadipatri Municipality: 18..18..18.. తాడిపత్రిపై స్టేట్ వైజ్ టెన్షన్.. ఈ లెక్కలు చూస్తుంటే నిపుణుల బుర్రలే వేడెక్కిపోతున్నాయ్

ఆట ఏదైనా గెలుపే ప్రధానం. పొలిటికల్‌ పిచ్‌పై తాడిపత్రి చైర్మన్‌గిరి ట్వంటీ-ట్వంటీ మ్యాచ్‌ను తలపిస్తోంది. అంతటా గెలిచాం.. ఆ ఒక్కటి ఎంత? అంటోంది పవర్‌ టీమ్‌.

Tadipatri Municipality: 18..18..18.. తాడిపత్రిపై స్టేట్ వైజ్ టెన్షన్.. ఈ లెక్కలు చూస్తుంటే నిపుణుల బుర్రలే వేడెక్కిపోతున్నాయ్
Tadipatri Municipal Electio
Ram Naramaneni
|

Updated on: Mar 17, 2021 | 9:03 PM

Share

ఆట ఏదైనా గెలుపే ప్రధానం. పొలిటికల్‌ పిచ్‌పై తాడిపత్రి చైర్మన్‌గిరి ట్వంటీ-ట్వంటీ మ్యాచ్‌ను తలపిస్తోంది. అంతటా గెలిచాం.. ఆ ఒక్కటి ఎంత? అంటోంది పవర్‌ టీమ్‌. ఎక్కడెక్కడ గెలిచామన్నది కాదు అసలు ఆట ఇచ్చట అంటోంది జేసీ టీమ్‌. మరి కుర్సీ ఎవరికి? .. ఎవరి లెక్కేంటి?… 18..18..18.. తాడిపత్రి హిస్టరీలో ఇదో వండర్‌ నెంబర్‌….. అదెలాగో ఓ లుక్కేద్దాం పదండి.

తాడిపత్రి తడాఖాకు.. 18వ తారీఖ్‌కు ఓ లింకుంది. అద్దాల మేడలో అధికారానికి దారి ఎవరికో తేలిదే పద్దెనిమిదినే. చైర్మన్‌గిరి ఎవరి ఖాతాలోకి వెళ్తుందనే లెక్క కూడా పద్దెనిమిదో నెంబర్‌ కాడే ఆగింది. హోల్‌ ఆంధ్రాలో ఫ్యాన్‌ టాప్‌ నెంబర్‌లో దూసుకెళ్లినా.. తాడిపత్రిలో మాత్రం ఆ స్పీడ్‌కు జరంత బ్రేక్‌ పడింది.

తాడిపత్రి మున్సిపల్‌లో మొత్తం వార్డులు 36 . టీడీపీ 18 వార్డుల్లో … వైసీపీ 16 వార్డుల్లో గెలిచాయి. సీపీఐ ఒక స్థానం.. ఇండిపెండెంట్‌ మరో స్థానం కైవసం చేసుకున్నాయి. ఎంపీ, ఎమ్మెల్సే ఎక్స్‌ అఫిషియో ఓట్లతో వైసీపీ బలం 18కి చేరింది. ఈ లెక్కన వైసీపీ-టీడీపీ సంఖ్యాబలం సరిసమంగా వుంది. మరి చైర్మన్‌గిరి దక్కేదెవరికి?.. ఆ పొద్దు జరిగిన గొడవేమో కానీ ఈ పొద్దు పైచేయి ఎవరిది? అన్నది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది

పురపాలక భవనం అద్దాలెక్కే టీడీపీ-వైసీపీ బలాబలాల లెక్కలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఈ అద్దాల మేడలో చైర్మన్‌ కుర్సీ దక్కేవదరికో తేల్చే డిసైడింగ్‌ ఫ్యాక్టరే మాత్రం కన్పించని మంత్రాంగమే. విజయం తమమే అని పక్కాగా చెబుతున్నారు జేసీ దివాకర్‌ రెడ్డి తనయుడు  పవన్‌కుమార్‌ రెడ్డి. బల్లగుద్దకుండనే అంత బలంగా చెప్పడం వెనుక లెక్కేంటి? సీపీఐ, ఇండిపెండింట్‌ అభ్యర్థులు సైకిల్‌ ఎక్కుతారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

వస్తే వస్తది..పోతేపోతది.. తమకు ఫరక్‌ పడేది ఏం లేదని.. దాని గురించి పెద్ద చర్చ అవసరంలేదన్నారు బొత్స సారు. అంతేకాదు తలుచుకుంటే పవర్‌ చేజిక్కించుకోవడానికి రెండు నిమిషాలు చాలన్నారు కూడా. జేసీ ప్రభాకర్‌ రెడ్డి తమ పార్టీ కౌన్సిలర్లు అందర్నీ క్యాంప్‌కు తీసుకెళ్లి వారందర్నీ కంటికి రెప్పగా కాపాడుకుంటున్నారు.  వైసీపీ నుంచి తమతో నలుగురు టచ్‌లో వున్నారని ఓ లీకు ఇచ్చారు. తీరా చూస్తే గెలుపు గుర్రాలతో బెంగళూరు విడిదికెళ్లారే  ఫోటోలు తళుక్కుమనిపించారు. ఇండిపెండెంట్‌, సీపీఐ అభ్యర్థులు కూడా క్యాంప్‌లో వున్నారనే టాక్‌ కూడా ఉంది.

సంఖ్యాబలం ప్రకారమే చైర్మన్‌ ఎన్నిక జరగాలని సీఎం స్పష్టంగా చెప్పారన్నది బొత్స మాట. మరి సీపీఐ వెర్షన్‌ ఏంటి? వైసీపీకి ఓటేస్తారా?  టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం.. చైర్మన్ ‌ఎన్నికలో ఆ పార్టీకే ఓటేస్తామనేది సీపీఐ ఇచ్చిన క్లారిటీ. ఆ దిశగా విప్‌ కూడా జారీ చేశారు. మరి కండీషన్స్‌ అప్లయ్‌ అవుతాయా.. లేదా అన్నది చూడాలి. మరి ఆ సమయం వచ్చినప్పుడు  ఊహించని ట్విస్టులు తెరపైకి వస్తాయా? ఇప్పటి దాక ఓ లెక్క.. చైర్మన్‌ ఎన్నికల్లో చేతులెత్తే వేళ లెక్క మరోలా మారే అవకాశం వుందా?.. అన్నది తేలాల్సి ఉంది.

Also Read:

West Godavari Crime: పశ్చిమగోదావరి జిల్లాలో ఖతర్నాక్ దొంగలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌నే దోచేశారు

TTD News: తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 20న నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్స్ విడుదల