AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Godavari Crime: పశ్చిమగోదావరి జిల్లాలో ఖతర్నాక్ దొంగలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌నే దోచేశారు

ప్రజల ఇళ్లల్లో దొంగతనాలు జరిగితే పోలీసులకు చెప్పుకుంటారు. అలాంటిది.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే చోరీ జరిగితే..ఎవరికి చెప్పుకుంటారు..?

West Godavari Crime: పశ్చిమగోదావరి జిల్లాలో ఖతర్నాక్ దొంగలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌నే దోచేశారు
Looted Money From Ps
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 17, 2021 | 8:34 PM

ప్రజల ఇళ్లల్లో దొంగతనాలు జరిగితే పోలీసులకు చెప్పుకుంటారు. అలాంటిది.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే చోరీ జరిగితే..ఎవరికి చెప్పుకుంటారు..? కానీ, నిజంగానే…ఓ దొంగోడు ఏకంగా పోలీస్ స్టేషన్ కే కన్నం వేశాడు. పోలీసులకు మస్కా కొట్టి 8 లక్షలు కాజేశాడు.. దీంతో పోలీసులకు దిమ్మ తిరిగినట్లైంది.

పశ్చిమగోదావరి జిల్లాలోని వీరవాసరం పోలీస్ స్టేషన్ లో చోరీ జరిగింది. ఓ దొంగ ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే 8 లక్షలు దోచేశాడు. పోలీస్ స్టేషన్ లో ఇంత డబ్బు ఎక్కడిదంటే..గత కొన్ని రోజులుగా బ్యాంకులకు వరుస సెలువులు వచ్చాయి. దీంతో ఏపీలోని ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మిన డబ్బును వీరవాసరంలోని పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు ఎక్సైజ్ సిబ్బంది. ఈ విషయం మరి ఆ దొంగకు ఎలా తెలిసిందో గానీ.. పోలీస్ స్టేషన్ పై గురి పెట్టి స్కెచ్ అమలుచేశాడు. రాత్రికి రాత్రి మొత్తం ఎక్సైజ్ శాఖకు చేరాల్సిన 8లక్షల సొమ్మును దొంగిలించి పారిపోయాడు.

ఈ నెల 15వ తేదీన నగదు మొత్తం లాకప్ లోని ఒక బాక్సులో ఉంచి తాళాలు వేసారు ఖాకీలు. తాళాలు బద్దలు కొట్టి నగదు అపహరించి మళ్ళీ తాళాలు వేసారు. దీంతో పోలీసులు ఈ దొంగతనంపై కేసు నమోదుచేసి సదరు దొంగ కోసం గాలింపు ముమ్మరం చేశారు. అయితే నగదు గురించి తెలిసినవారు ఎవరైనా, ఈ స్కెచ్ వేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also Read:

BREAKING NEWS: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు.. పూర్తి వివరాలు ఇవే

Vakeel Saab Review: సినిమా బ్లాక్ బస్టర్, పవన్ ఈజ్ బ్యాక్… ఫస్ట్ రివ్యూ చెప్పేసిన ఆ క్రిటిక్