Rajasthan Crime : రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి మరణ శిక్ష
Rajasthan Crime : రాజస్థాన్‌లో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ప్రబుద్ధుడికి పోక్సో కోర్టు సంచలన తీర్పు వెల్లడిచింది. నిందితుడికి
Rajasthan Crime : రాజస్థాన్‌లో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ప్రబుద్ధుడికి పోక్సో కోర్టు సంచలన తీర్పు వెల్లడిచింది. నిందితుడికి ఉరి శిక్ష విధించింది. ఈ కేసులో వేగంగా చర్యలు తీసుకున్నందుకు కోర్టు పోలీసులను అభినందించింది. 21 ఏళ్ల సునీల్ కుమార్ ఫిబ్రవరి 19 సాయంత్రం తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి స్కూటీపై నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐదు గంటల్లో నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
సంఘటన జరిగిన 10 రోజుల్లోనే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడంతో కోర్టు ఈ రోజు తీర్పును ప్రకటించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదైన 26 రోజుల్లోనే అధికారులు ఈ కేసులో పురోగతి సాధించారు. దీంతో 27వ రోజు కోర్టు దోషికి మరణ దండన విధించింది. కాగా, చిన్నారిపై దోషి అత్యాచారానికి ఒడిగట్టిన తీరు అత్యంత హేయమైనదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానించారు. మరణదండనే అతనికి సరైన శిక్ష అని పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. చాలా కేసుల్లో కోర్టు తీర్పులు చాలా ఆలస్యమవుతున్నాయి. దీంతో నిందితులు యథేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు. మిగతా కేసుల్లో కూడా ఇదే మాదిరిగా తీర్పులివ్వాలని వనితా లోకం కోరుతుంది.