మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. గత 24గంటల్లో 23 వేలకు పైగా కేసులు.. ఎంతమంది మరణించారంటే?
Maharashtra COVID19 cases: దేశంలో కరోనావైరస్ కొరలు చాస్తోంది. రోజురోజూకూ కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోనే కేసులు వేల సంఖ్యలో వెలుగులోకి వస్తుండటంతో ఆందోళన
Maharashtra COVID19 cases: దేశంలో కరోనావైరస్ కొరలు చాస్తోంది. రోజురోజూకూ కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోనే కేసులు వేల సంఖ్యలో వెలుగులోకి వస్తుండటంతో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 23,179 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 84 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,70,507 కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 53,080 కు పెరిగింది.
ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 9,138 మంది రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 21,63,391 కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 1,52,760 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా.. మహారాష్ట్ర దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా తొలిస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పలు ఆంక్షలను విధించి చర్యలు తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు అయినప్పటికీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
Maharashtra reports 23,179 new COVID-19 cases, 9,138 discharges and 84 deaths in the last 24 hours
Total cases: 23,70,507 Total discharges: 21,63,391 Active cases: 1,52,760 Death toll: 53,080 pic.twitter.com/exO3la7Kkf
— ANI (@ANI) March 17, 2021