Covid vaccine: ఇదేం పద్దతి.. వ్యాక్సిన్‌ వృధాలో తెలుగు రాష్ట్రాలే టాప్‌.. సమీక్షించుకోవాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ

Central Govt: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. మరోవైపు కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రాల

Covid vaccine: ఇదేం పద్దతి.. వ్యాక్సిన్‌ వృధాలో తెలుగు రాష్ట్రాలే టాప్‌.. సమీక్షించుకోవాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 17, 2021 | 7:54 PM

Central Govt: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. మరోవైపు కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షించారు. ముఖ్యంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ వృధాను అరికట్టాలంటూ పలు రాష్ట్రాలను కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 10శాతం టీకాలు వృథా అయ్యాయని.. దీనిపై సమిక్షించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. దీంతోపాటు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ కూడా  ప్రకటనను విడుదల చేసింది.  వ్యాక్సిన్‌ వృధాలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలే కారణమని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 10 శాతం కరోనా వ్యాక్సిన్‌లు వ్యర్థాలుగా మారుతున్నాయని.. ఇది ఆలోచించదగ్గ విషమని పేర్కొంది. కోవిడ్ -19 వ్యాక్సిన్ల వ్యర్థానికి ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, యూపీ రాష్ట్రాలే కారణమని, ఈ ప్రాంతాల్లో 6.5శాతం వృధా అవుతున్నాయని పేర్కొంది.

మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కేంద్రం రాష్ట్రాలకు పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్‌లల్లో తెలంగాణ 17.6 శాతం వృధా చేయగా, ఆంధ్రప్రదేశ్ 11.6 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 9.4 శాతం వృధా చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాల తరువాత కర్ణాటక 6.9 శాతం వ్యాక్సిన్లను వృధా చేసిందని పేర్కొంది. కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తెరిచిన కొన్ని గంటల్లోనే ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతోపాటు రవాణా చేసే సమయంలో.. నిల్వ చేసే సమయంలో కూడా వ్యాక్సిన్‌ వృధా అవుతుందని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు.

ముఖ్యంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలని కేంద్రం రాష్ట్రాలకు ఇప్పటికే సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో కూడా వ్యాక్సిన్‌ను వృధా చేయడం ఏమిటంటూ కేంద్రం రాష్ట్రాలను ప్రశ్నించింది. టీకాలు అమూల్యమైనవని.. జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని.. వృధాను తగ్గించాలని రాష్ట్రాలకు సూచించినట్లు ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. కాగా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలల్లో ఇప్పటివరకు ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లను అందించినందుకు కేంద్రం ప్రశంసించింది.

Also Read:

Covid vaccine: వ్యాక్సిన్ తీసుకున్నా.. గుజరాత్‌ మంత్రికి కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన ఈశ్వర్ సింగ్..

చిరిగిన జీన్స్, వీటి ధారణ మన సంస్కృతికి చిహ్నమా ? వివాదం రేపిన ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ వ్యాఖ్యలు