AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరిగిన జీన్స్, వీటి ధారణ మన సంస్కృతికి చిహ్నమా ? వివాదం రేపిన ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ వ్యాఖ్యలు

నేటి యువత మోకాళ్ళ వద్ద చిరిగిన జీన్స్ తో దర్శనమిస్తోందని, ఇది మన సంస్కృతికి చిహ్నమా అని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ ప్రశ్నించారు. 

చిరిగిన జీన్స్, వీటి ధారణ  మన సంస్కృతికి చిహ్నమా ? వివాదం రేపిన  ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ వ్యాఖ్యలు
Ripped Jeans
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 17, 2021 | 7:28 PM

Share

నేటి యువత మోకాళ్ళ వద్ద చిరిగిన జీన్స్ తో దర్శనమిస్తోందని, ఇది మన సంస్కృతికి చిహ్నమా అని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ ప్రశ్నించారు.  ముఖ్యంగా  మహిళలు, యువతులు ఈ విధమైన చిరిగిన జీన్స్ ధరిస్తున్నారని,  కుటుంబంలో తమ పిల్లలకు వీరు  ఇలాంటి వాతావరణాన్ని  కల్పించడం సబబా అని ఆయన అన్నారు. చక్కని హుందా అయిన పరిస్థితులను ఇవి కల్పించగలుతాయని తాను విశ్వసించడం లేదన్నారు. డెహ్రాడూన్ లో  బాలల హక్కుల పరిరక్షణకు  సంబంధించి ఉత్తరాఖండ్ స్టేట్ కమిషన్  నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఒక స్వచ్చంద సంస్థను (ఎన్జీఓ) ను నిర్వహిస్తున్న ఓ మహిళే   ఈ విధమైన జీన్స్ ధరించిందని, ఇది చూసిన తాను షాక్ తిన్నానని  ఆయన చెప్పారు. ఈ మహిళ ఈ సమాజానికి ఏ సందేశం ఇస్తుందన్నారు. ఇలాంటి మహిళలు సమాజంలోకి వెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తామంటూ వెళ్తే ..వీరు ఇచ్చే సందేశాలకు విలువ ఉంటుందా అని ఆయన అభిప్రాయపడ్డారు.  మన సొసైటీకి, మన పిల్లలకు మనం ఎలాంటి మెసేజ్ ఇస్తాం..కుటుంబం నుంచే …,ఇంటి నుంచే ఇది ప్రారంభమవుతుందని, మనం చేసే పనిని పిల్లలు కూడా అనుసరిస్తారని ఆయన అన్నారు. ఇంటిలో మనం వీరికి సరైన సంస్కృతినిస్తే.. అది  వారు ఆ తరువాత ఎంత అధునాతనంగా తయారైనా.. తమ  జీవితంలో విఫలం కారని తీరత్ సింగ్ రావత్ వ్యాఖ్యానించారు.

మోకాళ్ళను నగ్నంగా చూపడంపట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసలు ఇది మన కల్చర్ కాదని, విదేశాల్లో వారు ఓ వైపు  మన దేశపు యోగా , పూర్తి  వస్త్ర ధారణ చేస్తుంటే మరో వైపు మనం నగ్నత్వం వైపు పరుగులు పెడుతున్నామని ఆయన విచారం వ్యక్తం చేశారు. మోకాళ్ళను నగ్నంగా చూపడం, ధనికుల్లా కనబడడానికి తహతహలాడడం..ఇలాంటివి మనం మన పిల్లలకు నేర్పుతున్నామని, కుటుంబం నుంచి కాకపోతే ఈ తరహా ధోరణులు ఎక్కడి నించి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు మన స్కూళ్ళు లేదా టీచర్ల దోషం ఎక్కడుందన్నారు.

కాగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా ..ఇది ఆధునిక ఇండియా అని, డియర్ బీజేపీ ముఖ్యమంత్రీ.. మీరు యువతకు ఏం చెప్పదలచుకున్నారని అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై ప్రి విలేజ్‌ పిడుగు.. పదవిలో ఉన్నా లేకున్నా విచారణకు హాజరు కావాల్సిందేనన్న కమిటీ..

బెంగాల్ ఎన్నికలు, బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి నామినేషన్ ని రద్దు చేయాలంటూ టీఎంసీ డిమాండ్, ఈసీకి లేఖ