Madhya Pradesh: రైతుపై పగబట్టిన ప్రకృతి.. చేతికి వచ్చిన పంట నేల రాలడంతో.. చేలోనే దొర్లి ఏడ్చిన వృద్ధ రైతు ..
అందరికీ అన్నం పెట్టె అన్నదాత తాను తినడానికి మాత్రం మెతుకులు లెక్కించాల్సిన దుస్థితి ఉంది.. జై కిసాన్ అనడమే కానీ ఆరుగాలం కష్టించి పండించే రైతు గోడును పట్టించుకునే నాథుడే లేడు. ఇక కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన...
Madhya Pradesh: అందరికీ అన్నం పెట్టె అన్నదాత తాను తినడానికి మాత్రం మెతుకులు లెక్కించాల్సిన దుస్థితి ఉంది.. జై కిసాన్ అనడమే కానీ ఆరుగాలం కష్టించి పండించే రైతు గోడును పట్టించుకునే నాథుడే లేడు. ఇక కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం వెర్సెస్ రైతులు అన్న చందంగా సాగుతుంది. ఓ వైపు రైతులు కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు. మరోవైపు కేంద్రం రద్దు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది.
రైతుపై ప్రకృతి కూడా పగబట్టిందా అనిపించేలా ఒకొక్కసారి అతివృష్టి,మరోసారి అనావృష్టితో పంటలను సర్వనాశనం చేస్తుంది. చేతికి వచ్చే సమయానికి పంట దెబ్బతింటే ఆ రైతు పడే బాధ వర్ణనాతీతం. ఇటువంటి ఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
చేతికి వచ్చే సమయానికి వడగండ్ల తో పంట దెబ్బ తినడంతో మధ్యప్రదేశ్ లోని చందేరి గ్రామానికి చెందిన సజ్జన్ సింగ్ అనే వృద్ధ రైతు కన్నీరు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వడగండ్ల కారణంగా తన పంట తీవ్రంగా దెబ్బతినడంతో ఒక్కసారిగా ఆ పంటపై పడి దొర్లుతూ తన పంటను పట్టుకొని ఏడ్చేశాడు. వ్యవసాయం కోసం సజ్జన్ సింగ్ బ్యాంక్ నుంచి వ్యవసాయ ఋణం తీసుకున్నాడు.. ఇప్పుడు ఆ పంటను అమ్మి అప్పు తీర్చవచ్చు అనుకునే సమయానికి వడగండ్లతో నష్టపోయాడు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీగా వడగండ్ల వాన పడింది. దీంతో అక్కడ భారీగా వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. గోధుమ, నూనె గింజలు, పప్పు ధాన్యాలు ఇలా ప్రతి పంట నష్టపోయింది. తమను ప్రభుత్వం అదుపుకోవాలని అక్కడ అన్నదాత కోరుతున్నాడు. వృద్ధ రైతు [పొలంలో పెట్టిన కన్నీరు ఆ వీడియో చూసిన వారికీ సైతం కంట నీరు తిరుగుతుంది.
Read Also :రజనీతో ముచ్చటగా మూడోసారి.. మరోసారి నెగిటివ్ రోల్‌లో అలరించనున్న జగ్గూబాయ్..