మరొక కథనంలో శ్రీ రంగరాయ భార్య రాణి అలమేలు నగలపై కన్నేసిన మైసూరు రాజు రాజాఒడయార్ తలకాడుపై తన సైన్యంతో దాడిచేస్తాడు. అది చూసిన రాణి అలివేలు కి పట్టరాని ఆవేశం వచ్చింది. అటు భర్తనీ, ఇటు రాజ్యాన్నీ దక్కించుకోలేని దైన్యంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తాను మరణించే ముందు తలకాడు ఇసుక దిబ్బగానూ, మాలంగి ఒక సరస్సుగాను, మైసూరు రాజులు వారసులు లేకుండా పోతారని తన దుగ్ధనంతా ఒక శాపంగా మార్చిందని స్తానికులు చెబుతారు.