‘ఆప్ ఇతర రాష్ట్రాల్లో బలపడుతుంటే బీజేపీ భయపడుతోంది’, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపాటు

తమ ఆప్ పార్టీఇతర రాష్ట్రాల్లో బలపడుతుంటే బీజేపీ భయపడుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు   గల అధికారాలు, బాధ్యతలను నిర్దేశించడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్రం తేవడాన్ని ఆయన తప్పు పట్టారు.

'ఆప్ ఇతర రాష్ట్రాల్లో బలపడుతుంటే బీజేపీ భయపడుతోంది', ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపాటు
Arvind Kejriwal
Follow us

| Edited By: Phani CH

Updated on: Mar 17, 2021 | 7:56 PM

తమ ఆప్ పార్టీఇతర రాష్ట్రాల్లో బలపడుతుంటే బీజేపీ భయపడుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు   గల అధికారాలు, బాధ్యతలను నిర్దేశించడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్రం తేవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇతర రాష్ట్రాల్లో మేము బలపడుతున్నాం.. అందుకే బీజేపీ భయపడుతోంది అని చెప్పిన ఆయన.. ఏ ఎన్నికలో బీజేపీ  ఓడిపోయినా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. ‘ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2021 ‘ను లోక్ సభలో ఈ నెల 15 న ప్రభుత్వం ప్రవేశపెట్టింది. . ఈ బిల్లును నిరసిస్తూ బుధవారం జంతర్ మంతర్ వద్ద ఆప్ నేతలు, కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. దీన్ని  తక్షణమే  ఉపసంహరించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. తన ప్రభుత్వాన్ని బలహీనపరచేందుకు, ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం యత్నిస్తోందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని ఈ బిల్లు ఉద్దేశమని, ఇదే జరిగితే ఇక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తారని ఆయన ప్రశ్నించారు. అలాగే ఎన్నికలు, ఓట్లు, 70 సీట్లలో 62 సీట్లు ఎక్కడికి వెళ్తాయన్నారు . ఇది ప్రజలను ఫ్రాడ్ చేయడమే అని అయన వ్యాఖ్యానించారు.

ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను  ఈ బిల్లు ద్వారా కుదించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇది హేయమైన చర్య అని ఆయన ట్వీట్ చేశారు .ఇక డెప్యూటీ సీఎం మనీష్ శిశోడియా ,,  ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్ కి కట్టబెట్టడానికి ఈ బిల్లును తెచ్చారని ఆరోపించారు.  దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో పాలన సాగించుకోవాలనుకుంటున్నదని ఆయన దుయ్యబట్టారు.  కానీ ఈ ఆటలు సాగబోవన్నారు.  ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని  ఇలా బలహీన పరచే ప్రయత్నం చేస్తారా అని కూడా శిశోడియా తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారికి అసలు వాస్తవాలు ఏమిటో తెలుసునని ఆయన అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: Covid vaccine: ఇదేం పద్దతి.. వ్యాక్సిన్‌ వృధాలో తెలుగు రాష్ట్రాలే టాప్‌.. సమీక్షించుకోవాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ

BREAKING NEWS: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు.. పూర్తి వివరాలు ఇవే

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు