Elections 2021: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఇప్పటివరకూ ఎన్ని కోట్ల అక్రమ నగదు పట్టుబడిందో తెలుసా..?
ECI - Elections 2021: దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రధానపార్టీలన్నీ
ECI – Elections 2021: దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరిగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా భారీగా నగదు, వస్తువులు, సామాగ్రి, బంగారం పట్టుబడుతోంది. ఈసారి ఏకంగా రూ.300 కోట్లకు పైగా సంపదను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న రూ.331.47 కోట్ల సంపద పట్టుబడినట్లు వెల్లడించింది. 2016 ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న సంపదతో పోలిస్తే.. ఇది అధికమని తెలిపింది. స్వాధీనం చేసుకున్న నగదులో అత్యధికంగా తమిళనాడులో, ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌లో పట్టుబడినట్లు వెల్లడించింది.
అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు ఇలా.. తమిళనాడు రాష్ట్రంలో రూ.127 కోట్లు పశ్చిమ బెంగాల్‌లో రూ.112.59 కోట్లు అస్సాం రాష్ట్రంలో రూ.63 కోట్లు కేరళలో రూ.21.77 కోట్లు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రూ.5.72 కోట్లు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మొత్తం 295 మంది అధికారులను ఫ్లైయింగ్ స్కాడ్ కింద నియమించినట్టు ఈసీ పేర్కొంది. వీరితోపాటు మరో ఐదుగురు ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు ఉన్నారని తెలిపింది. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 259 స్థానాలను సున్నితమైనవిగా గుర్తించినట్టు వెల్లడించింది. అయితే గతంలో 2016లో జరిగిన ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ సంపద రూ.225.17 కోట్లు. అయితే ఈసారి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో వెండి ఆభరణాలతో సహా.. నగదును భారీగా తరలిస్తున్నారు.
Also Read: