Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన ఘర్షణలు.. కర్ఫ్యూ సడలింపు రద్దు

మణిపుర్‌లో ఇంకా ఘర్షణలు ఇంకా చల్లారలేవు. అక్కడ మెయితీ, కూకీ జాతుల మధ్య చెలరేగిన అల్లర్లు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. పోలీసులు ఇటీవల అరెస్టు చేసినటువంటి అయిదుగురు యువకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. అక్కడ పెద్దఎత్తున స్థానికులు పోలీస్‌స్టేషన్‌ల ముట్టడికి ప్రయత్నాలు చేశారు. పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అయితే నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌లు వినియోగించారు.

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన ఘర్షణలు.. కర్ఫ్యూ సడలింపు రద్దు
Manipur Violence
Follow us
Aravind B

|

Updated on: Sep 21, 2023 | 10:15 PM

మణిపుర్‌లో ఇంకా ఘర్షణలు ఇంకా చల్లారలేవు. అక్కడ మెయితీ, కూకీ జాతుల మధ్య చెలరేగిన అల్లర్లు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. పోలీసులు ఇటీవల అరెస్టు చేసినటువంటి అయిదుగురు యువకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. అక్కడ పెద్దఎత్తున స్థానికులు పోలీస్‌స్టేషన్‌ల ముట్టడికి ప్రయత్నాలు చేశారు. పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అయితే నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌లు వినియోగించారు. అయితే ఈ క్రమంలోనే దాదాపు 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. అయితే పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యగా పోలీసులు తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాల్లో విధించినటువంటి కర్ఫ్యూ సడలింపులను రద్దు చేశారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఆయుధాలు, భద్రతా బలగాల యూనిఫాంలతో తిరుగుతున్నటువంటి అయిదుగురు యువకులను సెప్టెంబరు 16న మణిపుర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందుకు తీసుకువచ్చి.. పోలీసు కస్టడీకి తరలించారు. అయితే.. ఆ అరెస్టుతో స్థానికంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. నిందితులను విడిచిపెట్టాలంటూ.. మంగళవారం నుంచి దాదాపు 48 గంటల పాటుగా లాక్‌డౌన్‌‌ను పాటించారు. అయితే ఈ క్రమంలోనే ఆయా సంఘాల పిలుపు వల్ల గురువారం మహిళలతో పాటు వందలాది మంది నిరసనకారులు తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాల్లోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఈ క్రమంలోనే వారిని చెదరగొట్టేందుకు.. పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.

అయితే ఈ ఘటనలో 10 మందికిపైగా గాయాలపాలయ్యారు. అంతేకాదు తమ అయిదుగురు వాలంటీర్లను విడుదల చేయడంలో పోలీసులు విఫలమయ్యారని నిరసనకారులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా అరెస్టు కావడం తప్ప తమకు వేరే దారిలేకపోయిందని వారు ఓ వార్తాసంస్థతో తెలిపారు. అలాంటి వారిని అరెస్టు చేస్తే.. మైయితీ గ్రామాలను ఎవరు రక్షిస్తారంటూ ప్రశ్నిల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా మరోవైపు.. స్థానికంగా ఉద్రిక్త పరిణామాలు చెలరేగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో విషయం ఏంటంటే ఇటీవల ఇంఫాల్‌ జంట జిల్లాల్లో కర్ఫ్యూ విధించింగా వాటిని సడలించింది. కానీ ఇప్పుడు తాజాగా మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తడంతో ఆ సడలింపులను మళ్లీ రద్దు చేసింది. ఇదిలా ఉండగా మణిపూర్‌లో మే నుంచి అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటిదాకా 150 మందికి పైగా మరణించారు. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అంతేకాదు చాలావరకు ఇళ్లు కాలిపోవడంతో..వేలాది మంది వరకు ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..