Rahul Gandhi: రాహుల్ గాంధీ @ కూలీ.. రైల్వే స్టేషన్‌లో సమస్యలను నేరుగా తెలుసుకున్న కాంగ్రెస్ అగ్రనేత..
Rahul Gandhi @ Coolie: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం స్టైల్ మార్చేశారు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీలో ఈ మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా జనాల్లోనే ఉంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా ప్రజలతో కలిసిపోతూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఉపాధి, వారి పరిస్థితులు, కుటుంబ నేపథ్యం తదితర వివరాలను తెలుసుకోవడంతోపాటు..
Rahul Gandhi @ Coolie: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం స్టైల్ మార్చేశారు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీలో ఈ మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా జనాల్లోనే ఉంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా ప్రజలతో కలిసిపోతూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఉపాధి, వారి పరిస్థితులు, కుటుంబ నేపథ్యం తదితర వివరాలను తెలుసుకోవడంతోపాటు.. వారి సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా.. ఢిల్లీలోని రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కూలీలను రాహుల్ గాంధీ కలిశారు. వాళ్లతో చాలా సేపు ముచ్చటించారు. ఆ తరవాత పోర్టర్ డ్రెస్ వేసుకుని బ్యాడ్జ్ పెట్టుకున్నారు. అంతే కాదు.. కూలీలా మారి ఓ సూట్‌కేసుని కూడా మోశారు రాహుల్. దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ దగ్గర ఈ ఆసక్తికర ఘటన జరిగింది. రాహుల్ గాంధీ చుట్టూ వందలాది మంది కూలీలు సందడి చేశారు.
కిందటి నెలలో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కూలీలు.. ఓ వీడియోను విడుదల చేశారు.. రాహుల్ గాంధీ తమను కలవాలని, తాము ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని ఆ వీడియోలో స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని మనసున్న రాజకీయవేత్తగా అభివర్ణించారు..ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్త ఇప్పుడు రాహుల్ గాంధీ దృష్టికి చేరింది. దీంతో ఇవాళ ఆయన ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
వీడియో..
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సందర్శించడం పట్ల కూలీలు ఆనందం వ్యక్తంచేశారు. రాహుల్ తో కలిసి ఫొటోలు కూడా దిగారు.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిసే సమయంలో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఉన్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ ఇక్కడ ఆటో డ్రైవర్లు, పోర్టర్‌లను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తమ సమస్యలను ప్రభుత్వం ముందు నివేదిస్తానని చెప్పారు. మా అభిప్రాయాలను ప్రభుత్వం ముందు ఉంచుతామని రాహుల్ హామీ ఇచ్చారని, సమస్యల పరిష్కారానికి కృషి చేయడం గురించి మాట్లాడారని ఆ వ్యక్తి చెప్పాడు.
VIDEO | Congress leader Rahul Gandhi meets railway porters at Anand Vihar Railway Station in Delhi, wears porter dress and badge. pic.twitter.com/wYqOGOmB2v
— Press Trust of India (@PTI_News) September 21, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..