Emergency Alert: మీ ఫోన్‌కి కూడా బీప్ సౌండ్‌తో ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా.? దీని అసలు కథేంటంటే..
స్మార్ట్ ఫోన్‌లలో టెస్ట్ ఫ్లాష్ ద్వారా భారత్‌లో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను టెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. భారత టెలీ కమ్యూనికేషన్ విభాగం రా సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ నుంచి ఈ టెస్టింగ్ మెసేజ్‌ను పంపించారు. ఇదిలా ఉంటే ఈ టెస్టింగ్ జరపడం ఇదేతొలిసారి కాదు, కేంద్ర ప్రభుత్వం ఇది వరకు రెండుసార్లు పరీక్షించగా ఇదో మూడో సారి. అత్యవస పరిస్థితుల్లో దేశ ప్రజలను అలర్ట్ చేయడమే ఈ అలర్ట్ చేసే ముఖ్య ఉద్దేశం...
గురువారం చాలా మంది స్మార్ట్ ఫోన్‌లకు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. పెద్ద బీప్ శబ్దంతో స్క్రీన్‌పై అలర్ట్ కనిపించింది. తెలుగు, హిందీతో పాటు ఇంగ్లిష్ భాషల్లో ఒక అలర్ట్ మెసేజ్ వచ్చింది. వింత శబ్ధంతో అలర్ట్ రావడంతో యూజర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఫోన్ హ్యాక్ అయ్యిందా.? అన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ అలర్ట్ మెసేజ్ విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇంతకీ ఏంటీ అలర్ట్ మెసేజ్.? స్మార్ట్ ఫోన్ యూజర్లకు మాత్రమే ఎందుకు వచ్చింది.? లాంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
స్మార్ట్ ఫోన్‌లలో టెస్ట్ ఫ్లాష్ ద్వారా భారత్‌లో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను టెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. భారత టెలీ కమ్యూనికేషన్ విభాగం రా సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ నుంచి ఈ టెస్టింగ్ మెసేజ్‌ను పంపించారు. ఇదిలా ఉంటే ఈ టెస్టింగ్ జరపడం ఇదేతొలిసారి కాదు, కేంద్ర ప్రభుత్వం ఇది వరకు రెండుసార్లు పరీక్షించగా ఇదో మూడో సారి. అత్యవస పరిస్థితుల్లో దేశ ప్రజలను అలర్ట్ చేయడమే ఈ అలర్ట్ చేసే ముఖ్య ఉద్దేశం. సెప్టెంబర్ 15వ తేదీన ఇలాంటి అలర్ట్ మెసేజ్ ఒకసారి వచ్చింది. అయితే తాజాగా ఈరోజు (గురువారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో యూజర్లకు ఫ్లాష్ మెసేజ్ వచ్చింది.
ఇక ఈ ఫ్లాష్ అలర్ట్ మెసేజ్ విషయానికొస్తే.. దీనిని భారత ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ విభాగం సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపించారు. ఇక ఒక శాంపిల్ టెస్ట్ మేసేజ్.. ‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న TSET ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వయవస్థకి పంపబడింది. మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా భద్రత మరియ అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తాము’ అని సదర అలర్ట్ మెసేజ్‌లో పేర్కొన్నారు.
విపత్తుల సమయంలో దేశ ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడమే ఈ వ్యవస్థ ముఖ్య లక్షయం. ఇందులో భాగంగానే మొబైల్ ఆపరేటర్లు , సెల్ బ్రాడ్ కాస్టింగ్ వ్యవస్థలకు సంబంధించిన అత్యవసర హెచ్చరికల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. భూకంపాలు, సునామీ, వరదలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజాలను కాపాడేందుకు ఇలాంటి హెచ్చరికలను పంపించనున్నార. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు ఇలాంటి టెస్ట్ మెసేజ్‌లు పంపినట్లు కేంద్రం ప్రకటించింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..