Amazon Offers: అమెజాన్‌లో ఆ ఏసీపై కళ్లు చెదిరే ఆఫర్.. ఏకంగా 40 శాతం తగ్గింపు.. వివరాలివే
ఎండ వేడి నుంచి రక్షణనిచ్చే ఏసీ ఇటీవల కాలంలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏసీల వాడకం పరిమితంగా ఉన్నా పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఏసీ లేని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదేమో? అని అనిపిస్తుంది. అయితే అధిక ధర కారణంగా కొంచెం ఎక్కువ రేటు అయినా పర్లేదు మంచి ఏసీ కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇటీవల పెరిగిన ఆన్‌లైన్ మార్కెట్ కారణంగా ఏసీలపై కూడా మంచి తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంటున్నాయి.
పెరుగుతున్న టెక్నాలజీతో పాటు పెరిగిన సౌకర్యాల నేపథ్యంలో ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కొన్ని రకాల గృహోపకరణాలు తప్పనిసరయ్యాయి. ముఖ్యంగా ఎండ వేడి నుంచి రక్షణనిచ్చే ఏసీ ఇటీవల కాలంలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏసీల వాడకం పరిమితంగా ఉన్నా పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఏసీ లేని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదేమో? అని అనిపిస్తుంది. అయితే అధిక ధర కారణంగా కొంచెం ఎక్కువ రేటు అయినా పర్లేదు మంచి ఏసీ కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇటీవల పెరిగిన ఆన్‌లైన్ మార్కెట్ కారణంగా ఏసీలపై కూడా మంచి తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రముఖ భారతీయ బ్రాండ్ అయిన వోల్టాస్ 1 టన్ ఏసీపై అమెజాన్‌లో బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఈ ఏసీపై ఏకంగా 40 శాతం తగ్గింపు వస్తుంది. కాబట్టి అమెజాన్‌లో వోల్టాస్ ఏసీపై ఇచ్చిన ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.
తగ్గింపు ఇలా
వోల్టాస్ 1 టన్ టూ స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీపై 40 శాతం తగ్గింపు వస్తుంది. ఈ ఏసీ సాధారణ ధర రూ.55,990 కాగా ప్రస్తుతం ఆఫర్ ధరలో రూ.33,580కు అందుబాటులో ఉంది. అలాగే బ్యాంక్ ఆఫర్లను వర్తింపజేయడం ద్వారా ఏసీ ధరను మరింత తగ్గించవచ్చు. ప్రస్తుతం అయితే రెండు ప్రధాన బ్యాంకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏసీను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకూ తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై ఆరు నెలలు అంతకంటే ఎక్కువ సమయానికి ఈఎంఐ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే అదనం రూ.500 తగ్గుతుంది. అంటే ఈ ఆఫర్లను ఉపయోగించుకుంటే ఈ ఏసీ రూ.31,000 నుంచి రూ.32,000 ధర మధ్య లభిస్తుంది. ఈ వోల్టాస్ ఏసీ గురించి అదనపు ఫీచర్ల వివరాలను చూద్దాం.
వోల్టాస్ 1 టన్ ఏసీ స్పెసిఫికేషన్లు
వోల్టాస్ వన్ టన్ టూ స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌తో వస్తుంది. ఈ ఏసీ వేడిని లోడ్‌కు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంది. విభిన్న కూలింగ్ అవసరాల కోసం సర్దుబాటు చేసేలా ఫోర్ కూలింగ్ మోడ్స్‌తో పని చేస్తుంది. ఈ ఏసీ ఆర్ 32 రిఫ్రిజెరాంట్‌ను ఉపయోగిస్తుంది. ముఖ్యంగా ఈ ఏసీ కాపర్ కండెన్సర్‌తో వస్తుంది. అలాగే యాంటీ డస్ట్ ఫిల్టర్ ఏసీ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇది గాలి, దుమ్ముతో పాటు ఇతర చిన్న కణాలను తగ్గించడంలో సాయం చేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..