iPhone 15: యాపిల్ ఐఫోన్ 15 కొనాలనుకుంటున్నారా? రూ. 23వేలకు పైగా ఆదా చేసుకునే టిప్ ఇదిగో..
ఈ ఐఫోన్ మాత్రం ప్రపంచంలోని ప్రధాన మార్కెట్లైన అమెరికా, జపాన్, దుబాయ్, కెనడా వంటి దేశాలకన్నా మన దేశంలోనే చాలా ఎక్కువ ధర ఉంది. ఎంత తేడా అంటే మీరు దుబాయికి ఇండియా నుంచి విమానంలో వెళ్లి అక్కడ ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఫోన్ కొనుగోలు చేసి, తిరిగి విమానంలో ఇంటికి వచ్చినా.. ఇంకో రూ. 23,000 మిగులే ఉంటుంది. మన దేశంలో అంత ధర ఎందుకుంది?
యాపిల్ సంస్థ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఐఫోన్ 15 సిరీస్ ను ఆవిష్కరించింది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లు సెప్టెంబర్ 22 అంటే శుక్రవారం నుంచి మన దేశీయ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. సాధారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు భారీగానే ఉంటాయి. కానీ ఈ ఐఫోన్ మాత్రం ప్రపంచంలోని ప్రధాన మార్కెట్లైన అమెరికా, జపాన్, దుబాయ్, కెనడా వంటి దేశాలకన్నా మన దేశంలోనే చాలా ఎక్కువ ధర ఉంది. ఎంత తేడా అంటే మీరు దుబాయికి ఇండియా నుంచి విమానంలో వెళ్లి అక్కడ ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఫోన్ కొనుగోలు చేసి, తిరిగి విమానంలో ఇంటికి వచ్చినా.. ఇంకో రూ. 23,000 మిగులే ఉంటుంది. మన దేశంలో అంత ధర ఎందుకుంది? కారణమమేమిటి? ఆయా దేశాల్లో అంత తక్కువ ధర ఉండటానికి కారణమేమిటి? తెలుసుకుందాం రండి..
ఐఫోన్ ధరలు ఇలా..
- ఐఫోన్ 15 ధరలు ఇలా(మన కరెన్సీలో).. ఇండియాలో రూ. 79,900, దుబాయ్ లో రూ. 76,747, సింగపూర్ లో రూ. 79,051, యూఎస్ లో రూ. 66,266.
- ఐఫోన్ 15 ప్లస్ ధరలు ఇలా(మన కరెన్సీలో).. ఇండియాలో రూ. 89,900, దాబాయ్ లో రూ. 85,779, సింగపూర్ లో రూ. 88,180, యూఎస్ లో రూ. 74,560
- ఐఫోన్ 15 ప్రో ధరలు ఇలా(మన కరెన్సీలో).. ఇండియాలో రూ. 1,34,900, దుబాయ్ లో రూ. 97,069, సింగపూర్ లో రూ. 1,00,351, యూఎస్ లో రూ. 82,853.
- ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధరలు ఇలా(మన కరెన్సీలో).. ఇండియాలో రూ. 1,59,900, దుబాయ్ రూ. 1,15,133, సింగపూర్ లో రూ. 1,21,650, యూఎస్ లో రూ. 99,411గా ఉంది.
దుబాయ్ లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర..
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర యూఎస్ లో చాలా చీప్ గా దొరకుతుంది. కేవలం రూ. 99,411కే లభ్యమవుతుంది. అదే దాబాయ్ లో అయితే రూ. 1,15,133కి కొనుగోలు చేయొచ్చు. అదే మన ఇండియాలో ఇదే ఫోన్ రూ. 1,59,900గా ఉంటుంది. ఈ ధరలో ఉన్న తేడాను గమనిస్తే మన దేశంలో దాదాపు రూ. 43,000కు పైగానే తేడా ఉంది. అందుకే మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే దుబాయ్ కి విమానంలో వెళ్లి అక్కడ కొనుగోలు చేసి వచ్చినా మన దేశంలో పెట్టాల్సిన అంత మొత్తం కూడా పెట్టరు. ఇంకా డబ్బు మీ వద్ద మిగులు ఉంటుంది.
లెక్కలు ఇలా.. మీరు దుబాయ్ కి విమానంలో వెళ్లి రావడానికి టికెట్ ధర రూ. 20,000 అవుతుంది. ఆ దేశంలో విమానాశ్రయంలోనే మీరు వీసా తీసుకోవచ్చు. మన దేశంలో నుంచి వెళ్లే పర్యాటకులకు ఈ ప్రత్యేక వెసులుబాటు దుబాయ్ లో అందిస్తారు. అక్కడకు వెళ్లి ఏదైనా యాపిల్ స్టోర్ లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్(256జీబీ) ఫోన్ కొనుగోలు చేయొచ్చు. అక్కడ ధర ఏఈడీ 5,099 అంటే మన కరెన్సీలో రూ. 1,15,133 ఉంటుంది. ఇంకా అక్కడేమైనా ఆఫర్ ఉంటే ఇంకా తగ్గుతుంది. అంటే మన ఇండియాలో ధరతో పోల్చితే విమాన చార్జీలు ప్లస్ ఇంకా ఫోన్ ధర తీసి వేసినా ఇంకా రూ. 23,000 పైగానే మిగులు ఉంటుంది. దానిలో మీరు ఎంచక్కా దుబాయ్ లో నైట్ స్టే చేసి మళ్లీ రావచ్చు. మీరు ఫోన్ వారంటీ గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాపిల్ గ్లోబల్ వారంటీని అందిస్తుంది. కాబట్టి ఇక్కడే మీరు వారంటీని వినియోగించుకోవచ్చు.
మన దేశంలో ఎందుకంత ఖరీదు..
వాస్తవానికి యాపిల్ సంస్థ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లపై ధరను పెంచలేదు. ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లలో మాత్రం రూ. 20,000, రూ. 5,000 చొప్పున పెంచింది. కానీ ఇవి ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో ఖరీదైనవిగా మారిపోయాయి. ఇది ఎందుకు? వాస్తవానికి ఈ ఐఫోన్లు మన దేశంలోనే అసెంబుల్ అవుతాయి. అయితే వాటిల్లోని ప్రధాన కాంపోనెట్లు ఇంకా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇది వాటి ధరపై ప్రభావం చూపుతోంది. పైగా ఈ ప్రో మోడళ్లు మన దేశంలో అసెంబుల్డ్ అవడం లేదు. వీటిపై 22శాతం కస్టం డ్యూటీలు పడతాయి. ప్రస్తుతం మన రూపీ ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే చాలా బలహీనంగా ఉండటంతో ఐఫోన్ చాలా ఖరీదైనదిగా మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ ఉత్పత్తి కేంద్రం గనుక మన దేశంలో ప్రారంభమైతే ఈ ధరలు తగ్గే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..