- Telugu News Photo Gallery Technology photos Itel planning to launch budget 5g Smartphone itel P55 5G features and price details Telugu Tech News
5G Smartphone: ఇది కదా అదిరిపోయే డీల్ అంటే.. రూ. 10వేలలోనే 5జీ స్మార్ట్ ఫోన్..
రోజుకో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేస్తోంది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్స్‌లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్‌లకు గిరాకీ బాగా పెరిగింది. 5జీకి అప్‌డేట్ అవ్వాలనే ఉద్దేశంతో 5జీ ఫోన్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి కొత్త ఫోన్ వచ్చేస్తోంది...
Updated on: Sep 21, 2023 | 11:59 AM

5జీ స్మార్ట్ ఫోన్ అంటే కనీసం రూ. 25వేలకిపైగా బడ్జెట్ పెట్టాల్సిందే. అయితే ప్రస్తుతం టెక్నాలజీలో వచ్చిన మార్పులు, కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో ఫోన్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా రూ. 10 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐటెల్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకే 5జీ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. దసరా కానుకగా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఐటెల్ పీ55 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ నెలాఖరు నాటికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 10వేల కంటే తక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన ఎపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్ ఆక్టాకోర్, 1.6 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్‌తో పని చేస్తుందని తెలుస్తోంది.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెలత్స్ కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది.





























