- Telugu News Photo Gallery Technology photos Vivo offering rs 2000 discount on vivo y100a smartphone, Have a look on features and final price details
Vivo Y100A: వివో 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 64 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో సూపర్ ఫీచర్స్
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా మార్కెట్లోకి వివో వై100ఏ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌పై కంపెనీ తాజాగా భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అత్యాధునిక ఫీచర్స్‌తో కూడిన ఈ స్మార్ట్ ఫోన్‌పై వివో ఏకంగా రూ. 2 వేలు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంత.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Sep 21, 2023 | 10:30 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఇటీవల మార్కెట్లోకి వివో ఐ100ఏ పేరుతో ఈ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. గత ఏప్రిల్‌లో ఫోన్‌ను లాంచ్ చేసిన సమయంలో ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 23,999గా ఉండేది అయితే ప్రస్తుతం రూ. 2 వేలు డిస్కౌంట్‌తో రూ. 21,999కి లభిస్తోంది. ఇక 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ధర రూ. 23,999గా ఉంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు వివో ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.

ఇక ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.38 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌హెచ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

వివో వై100 స్మార్ట్ ఫోన్‌లో 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్సేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 22,750 డిస్కౌంట్ పొందొచ్చు.




