Cool Drinks: కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా ? అయితే ప్రమాదంలో పడ్డట్లే
ప్రస్తుత రోజుల్లో చాలామంది కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండటం లేదు. అయితే ఇవి కేవలం బరువును మాత్రమే పెంచుతాయే కానీ ఎలాంటి ఉపయోగం లేదని తాజాగా హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో తేలింది. అయితే ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతున్న పురుషులకు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే బరువు పెరగడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని అంటున్నారు. వాస్తవానికి ఎముకల పెరుగడానికి ఫాస్పరస్ అనేది చాలా ముఖ్యమైనది.

Cool Drinks
- ప్రస్తుత రోజుల్లో చాలామంది కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండటం లేదు. అయితే ఇవి కేవలం బరువును మాత్రమే పెంచుతాయే కానీ ఎలాంటి ఉపయోగం లేదని తాజాగా హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో తేలింది.
- అయితే ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతున్న పురుషులకు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే బరువు పెరగడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని అంటున్నారు. వాస్తవానికి ఎముకల పెరుగడానికి ఫాస్పరస్ అనేది చాలా ముఖ్యమైనది.
- ఎముకల అభివృద్ధికి తగినంత ఫాస్పరస్ తీసుకోవడం మంచింది. అయితే తక్కువ సీరం ఫాస్పేట్ స్థాయిలు మాత్రం పోషకాహార లోపాలను సూచిస్తాయి. బోలు ఎముకలు, ఎముకల పగుళ్లు లాంటి ప్రమాదాలకు కూల్ డ్రింక్స్ దారి తీస్తాయని చెబుతున్నారు పరిశోధకులు.
- అలాగే కూల్ డ్రింక్స్లను ఎక్కువగా తాగడంతో ప్రొటీన్ లోపం కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే వీటిని తాగేబదులుగా పుచ్చకాయ లాంటి పండ్ల రసాలు తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు పంచదార లేకుండా వీటిని తాగినట్లైతే మంచిందని చెబుతున్నారు. అంతేకాదు సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలని చెబుతున్నారు.
- చల్లటి శీతల పానీయాలు ఆహారంలో ఉండేటటువంటి క్యాల్షియంను మాత్రమే కాకుండా శరీరంలో ఉండే కాల్షియంను కూడా హరించివేస్తాయని అంటున్నారు. అందుకే కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఓ మోస్తరు చల్లగా వున్నవాటిని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.