Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canada: భారత్ విజ్ఞప్తులపై నిర్లక్ష్యం.. ఖలిస్థాన్ వేర్పాటువాదులకు స్థావరంగా కెనడా..

భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వేర్పాటువాదాన్ని ఉసిగొల్పుతోన్నటువంటి పలు సంస్థలు.. విదేశీ గడ్డను వేదికగా చేసుకొని తమ వ్యూహాలు అమలు చేస్తున్నాయనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. అయితే ఈ ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలిపే కొన్ని వేర్పాటువాద సంస్థలు కెనడా దేశాన్ని తమ స్థావరంగా చేసుకున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు ఇటీవలే పేర్కొన్నాయి. అయితే వాటిని బహిష్కరించాలని చేసినటువంటి విజ్ఞప్తులను కూడా కెనడా ప్రభుత్వం పక్కనపెడుతున్నట్లు వెల్లడించాయి.

Canada: భారత్ విజ్ఞప్తులపై నిర్లక్ష్యం.. ఖలిస్థాన్ వేర్పాటువాదులకు స్థావరంగా కెనడా..
Khalistan Flag
Follow us
Aravind B

|

Updated on: Sep 21, 2023 | 7:54 PM

భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వేర్పాటువాదాన్ని ఉసిగొల్పుతోన్నటువంటి పలు సంస్థలు.. విదేశీ గడ్డను వేదికగా చేసుకొని తమ వ్యూహాలు అమలు చేస్తున్నాయనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. అయితే ఈ ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలిపే కొన్ని వేర్పాటువాద సంస్థలు కెనడా దేశాన్ని తమ స్థావరంగా చేసుకున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు ఇటీవలే పేర్కొన్నాయి. అయితే వాటిని బహిష్కరించాలని చేసినటువంటి విజ్ఞప్తులను కూడా కెనడా ప్రభుత్వం పక్కనపెడుతున్నట్లు వెల్లడించాయి. అయితే తాజాగా ఇదే విషయాన్ని చెప్పిన భారత విదేశాంగశాఖ.. ఉగ్రవాదులకు కెనడా స్థావరంగా మారిపోయిందంటూ పేర్కొంది. ఇదిలా ఉండగా.. వరల్డ్‌ సిఖ్‌ ఆర్గనైజేషన్‌, ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌, సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ లాంటి ఖలిస్థానీ సానుభూతి సంస్థలు పాకిస్థాన్‌ కనుసన్నల్లో పనిచేస్తున్నట్లు ఆరోపణలు కూడా రావడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే ఇవన్నీ కూడా కెనడా స్థావరంగా తమ కార్యకలాపాలను నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే భారత్‌ ప్రకటించినటువంటి అనేక మంది మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టులు కూడా కెనడాలోనే తలదాచుకున్నట్లు ఢిల్లీ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. కెనడాలో ఇప్పటికే దాదాపు 20 మందికి పైగా మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే వారిని అక్కడ నుంచి బహిష్కరించేలా చేయడం.. అప్పగించే విషయంలో ఇండియా అనేకసార్లు దౌత్యపరంగా ప్రయత్నాలు చేసింది. అయినా కూడా కెనడా అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వీటికి సంబంధించినటువంటి అనేక పత్రాలను అందించినా కూడా.. ఫలితం లేకపోయింది. దీంతో ఒట్టావా వారికి మద్దతుగా నిలవడంతో ఇండియా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

సుమారు ఎనిమిది మంది ఉగ్రవాదులు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐతో కలిసి కుట్రలకు పాల్పడుతున్నట్లు ఇండియా చెబుతూ వస్తోంది. అంతేకాదు.. 1990లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినటువంటి గుర్వంత్‌‎సింగ్‌తో‌సహా వీరిందరిని కూడా బహిష్కరన చేయాలని భారత్‌ చేసినటువంటి విజ్ఞప్తులను కెనడా అధికారుల వద్ద కొన్ని సంవత్సరాలుగా పెండింగులో ఉండటం గమనార్హం. అలాగే గుర్వంత్‌పై ఉన్నటువంటి ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ అనే నోటీస్‌ సైతం ఇప్పటికీ పెండింగులో ఉంది. అయితే కెనడాలో ఆయన అడ్రస్‌ చెప్పినప్పటికీ కూడా అక్కడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోకపోవడం లేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల మరణించినటువంటి ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌పై తగు చర్యలు తీసుకోవాలని.. 2018లో పంజాబ్‌ సీఎంగా ఉన్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కూడా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు విజ్ఞప్తులు చేశారు. గుర్వంత్‌ సింగ్‌ బాత్‌, భాగత్‌ సింగ్‌ వంటి మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ వేర్పాటువాదులు కెనడాలోనే తలదాచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..