AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala Gold Dispute: శబరిమల బంగారు తాపడం వివాదంలో కీలక పరిణామం.. 10 మందిని విచారించనున్న సిట్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బంగారం తాపడం వివాదంలో మధ్యంతర నివేదికను కేరళ హైకోర్టుకు సమర్పించింది సిట్‌. బంగారం మాయం వ్యవహారంలో మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సిట్‌ నివేదిక ఆధారంగా 10 మంది నిందితులను విచారించబోతున్నారు.

Sabarimala Gold Dispute: శబరిమల బంగారు తాపడం వివాదంలో కీలక పరిణామం.. 10 మందిని విచారించనున్న సిట్‌
Sabarimala Gold Dispute
Shaik Madar Saheb
|

Updated on: Oct 21, 2025 | 3:28 PM

Share

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బంగారం తాపడం వివాదంలో మధ్యంతర నివేదికను కేరళ హైకోర్టుకు సమర్పించింది సిట్‌. బంగారం మాయం వ్యవహారంలో మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సిట్‌ నివేదిక ఆధారంగా 10 మంది నిందితులను విచారించబోతున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌ను సిట్‌ అరెస్ట్‌ చేసింది. అయితే.. తనను ట్రాప్‌ చేశారని ఉన్నికృష్ణన్‌ ఆరోపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

సిట్‌ ఎస్పీ శశిధరన్‌ సీల్డ్‌ కవర్‌లో మధ్యంతర నివేదికను హైకోర్టుకు సమర్పించారు. హైకోర్టు ఆదేశాలతో సిట్‌ బంగారం మాయం వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోంది. ట్రావెన్‌కోర్ట్‌ బోర్డు మాజీ సభ్యులపై కూడా సిట్‌ కేసు నమోదు చేసింది. 2019లో బోర్డు సభ్యులుగా ఉన్నవాళ్ల పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. శబరిమల ఆలయం నుంచి 445 గ్రాముల బంగారం మాయం కావడం సంచలనం రేపింది.

గర్భగుడి బయట బంగారు ఫలకాలకు తాపడం దాతగా ఉన్న ఉన్నికృష్ణన్‌కు స్థిరమైన ఆదాయమే లేనట్టు గుర్తించారు. శబరిమల గోల్డ్‌ మాయం కావడంపై హైకోర్టులో ఇన్‌కెమెరా విచారణ జరుగుతోంది. ఎలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయరాదని మీడియా సంస్థలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?