AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulwama Attack: పుల్వామా దాడికి పాల్పడ్డ కీలక ఉగ్రవాది హతం

40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న 2019 పుల్వామా దాడి సూత్రధారులలో ఒకడైన హమ్జా బుర్హాన్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో గుర్తుతెలియని దుండగుల చేతిలో గురువారం హతమయ్యాడు. ముజఫరాబాద్‌లో జరిగిన దాడిలో అనేక బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోంది.

Pulwama Attack: పుల్వామా దాడికి పాల్పడ్డ కీలక ఉగ్రవాది హతం
Hamza Burhan
Venkatrao Lella
|

Updated on: May 21, 2026 | 3:29 PM

Share

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పుల్వామా దాడి సూత్రధారి హమ్జా బుర్హాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. ‘డాక్టర్’ అని పిలువబడే హమ్జా బుర్హాన్ ముజఫరాబాద్‌లో దాడికి గురైన తర్వాత అనేక బుల్లెట్ గాయాలపాలయ్యాడు. ఈ గాయాలతో వెంటనే మరణించాడు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన బుర్హాన్.. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన 2019 పుల్వామా దాడి సూత్రధారులలో ఒకడుగా ఉన్నాడు. పూల్వామా దాడికి ఇతడే మాస్టర్ మైండ్ అని తెలుస్తోంది. పుల్వామా నివాసి అయిన బుర్హాన్ అసలు పేరు అర్జుమంద్ గుల్జార్ దార్. ఇతడిని 2022లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది.  పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో కాల్పులు జరగ్గా.. దాడి ఎవరు పాల్పడ్డారు..? హత్య వెనుక ఎవరు ఉన్నారు? అనే వివరాలు అధికారికంగా ఇంకా బయటకు రాలేదు. అధికారులు పూర్తి వివరాలను త్వరలో బయటపెట్టే అవకాశముంది.

యువతను ఉగ్రవాదం వైపు..

నిఘా సంస్థల నివేదిక ప్రకారం బుర్హాన్‌కు భారతదేశ వ్యతిరేక కార్యకలాపాల సుదీర్ఘ చరిత్ర ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని యువతను ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు నెట్టడానికి అతనే బాధ్యుడు అని తెలుస్తోంది.  అతను వాస్తవానికి జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని రత్నిపోరా ప్రాంతానికి చెందినవాడు అని సమాచారం. ఏడు సంవత్సరాల క్రితం చెల్లుబాటు అయ్యే పత్రాలను ఉపయోగించి పాకిస్థాన్‌ను సందర్శించాడు. అక్కడికి వెళ్లి అల్-బదర్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సమాచారం.  ఆ తర్వాత ఆ ఉగ్రవాద సంస్థకు ఆపరేషనల్ కమాండర్‌గా మారాడు.  దాని కోసం మిలిటెంట్లను నియమించే బాధ్యతను చేపట్టాడు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్‌లో ఆ సంస్థకు ఆయుధాల సరఫరా కోసం కూడా అన్వేషించినట్లు తెలుస్తోంది.

Follow Us
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
ఉచిత విద్య, వసతి, భోజనం.. వేద విద్యపై ఆసక్తి ఉన్నవారికి గోల్డెన్
ఉచిత విద్య, వసతి, భోజనం.. వేద విద్యపై ఆసక్తి ఉన్నవారికి గోల్డెన్