తెలుగు వైవు చూడని మిల్కీ బ్యూటీ.. ఇక పై కష్టమేనా.?
Rajeev
21 May 2026
instagram
మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ కు దూరం అవుతుందా.? అనే అనుమానం ఇప్పుడు టాలీవుడ్ ఫ్యాన్స్ లో మొదలైంది.
తమన్నా ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి భారీ హిట్స్ అందుకుంది. తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది తమన్నా.
హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది.
ఈ అందాల భామ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా అందరి హీరోలతో జత కట్టింది.
అలాగే చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతోనూ సినిమాలు చేసి మెప్పించిన తమన్నా కెరీర్ పీక్ లో ఉండగానే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
కేవలం హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ కూడా చేసి మెప్పిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో తమన్నా పెద్దగా తెలుగులో కనిపించలేదు .
చివరిగా ఓదెల 2 సినిమాలో కనిపించింది.. ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో అసలు తెలుగు వైపే చూడటం లేదు మిల్కీ బ్యూటీ.