AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..

రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..

Phani CH
|

Updated on: May 20, 2026 | 4:18 PM

Share

దుబాయ్‌లో రోడ్డుపై దొరికిన లక్ష దిర్హామ్‌ల నగదును స్వార్థం లేకుండా పోలీసులకు అప్పగించి మహ్మద్ అలీ నిజాయితీకి నిదర్శనంగా నిలిచాడు. వ్యాపారవేత్త రాజ్ తప్పిపోయిన రూ.26 లక్షలకు పైగా విలువైన నగదు కేవలం మూడు గంటల్లోనే తిరిగి అందింది. ఈ ఘటనతో దుబాయ్ పోలీసుల వేగవంతమైన స్పందనతో పాటు అలీ నిజాయితీ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

దుబాయ్‌లోని కరామాలో నివసిస్తున్న రాజ్ అనే ప్రవాస వ్యాపారవేత్త, తన వ్యాపార అవసరాల కోసం స్థానిక బ్యాంకు నుంచి 2,60,000 దిర్హామ్‌ల చెక్కును విత్‌డ్రా చేసుకున్నాడు. ఆ క్యాష్‌ను ఒక కవరులో పెట్టుకుని వస్తుండగా, మార్గమధ్యంలో కవరు కొద్దిగా తెరుచుకుని అందులోని ఒక లక్ష దిర్హామ్‌ల కట్ట కింద పడిపోయింది. ఇంటికి వెళ్లాక గానీ రాజ్ ఆ విషయాన్ని గమనించలేదు. వెంటనే బ్యాంకుకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, బ్యాంకు లోపల నగదు అంతా సరిగ్గా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే రఫా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తాను వచ్చిన మార్గంలో వెతకడం ప్రారంభించాడు. అదే సమయంలో ప్రవాసుడైన మహ్మద్ అలీకి రోడ్డుపై పడి ఉన్న నగదు కట్ట కనిపించింది. రోడ్డుపై డబ్బు కనిపిస్తే ఏం చేస్తారు.. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా అటూ ఇటూ చూసి వెంటనే జేబులో పెట్టేసుకుంటారు. చాలా మంది చేసేదిదే. అయితే మహ్మద్‌ అలీ దీనికి భిన్నంగా నిజాయితీని చాటుకున్నాడు. రోడ్డుపై పడి ఉన్న లక్ష దదర్హామ్‌ల అంటే భారత కరెన్సీలో రూ. 26.1 లక్షలు. అంత పెద్ద మొత్తం నగదును చూసినా ఏమాత్రం ఆశపడకుండా, వెంటనే పోలీసులకు అప్పగించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. యుఏఈలో అతి తక్కువ జీతంతో జీవితాన్ని ప్రారంభించి, ప్రస్తుతం ఒక చిన్న టైపింగ్ సెంటర్ నడుపుకుంటున్న అలీ.. ఆ భారీ మొత్తాన్ని చూసి ఎంతమాత్రం సంకోచించకుండా వెంటనే దుబాయ్ పోలీసులకు సమాచారం అందించి, నగదును వారికి భద్రంగా అప్పగించాడు. మహ్మద్ అలీ అప్పగించిన నగదు వివరాలను, రాజ్ కోల్పోయిన వివరాలను సరిపోల్చి, కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఆ సొమ్మును అసలు యజమాని అయిన రాజ్‌కు సురక్షితంగా అందజేశారు. గత 15 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం ఇదే మొదటిసారని, డబ్బు పోయిన సమయంలో తాను షాకైనట్లు రాజ్ తెలిపాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MS Dhoni: రిటైర్మెంట్‌‌పై ధోనీ.. హింట్‌ ఇచ్చినట్లేనా?

Jayam Ravi: భార్య VS లవర్‌! దెబ్బకు పిచ్చోడిలా తయారైన స్టార్ హీరో

20లక్షల కోసం.. హీరోయిన్‌ను చంపేసిన భర్త?

పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

Peddi: అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..

Follow Us