AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: అమ్మ బుచ్చి..  నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..

Peddi: అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..

Phani CH
|

Updated on: May 20, 2026 | 3:55 PM

Share

Ram Charan హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ట్రైలర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఇదే సమయంలో మూవీ రెమ్యునరేషన్స్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. చరణ్ ఈ సినిమా కోసం రూ.100 కోట్లకు పైగా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. Buchi Babu Sana, Janhvi Kapoor, A. R. Rahmanలకు కూడా భారీ పారితోషికాలు అందినట్టు సమాచారం.

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది రిలీజ్ కు సమయం దగ్గరపడుతోంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా మే 18న ట్రైలర్ రిలీజ్ చేయగా.. అది కాస్తా దిమ్మతిరిగే రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇక ఈ విషయం కాసేపు పక్కకు పెడితే… పెద్ది మూవీ.. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అందుకు తగ్గట్టుగానే భారీ క్యాస్టింగ్ ఉందీ సినిమాలో. ‘ఉప్పెన’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, జగపతి బాబు, బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ బొమన్ ఇరానీ , కమెడియన్ సత్య వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మెగా మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది నటుల రెమ్యునరేషన్స్ గురించి నెట్టింట ఇప్పుడో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పెద్ది సినిమాలో నటించినందుకు రామ్ చరణ్ ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతకు ముందు చరణ్… ట్రిపుల్ ఆర్,గేమ్ ఛేంజర్ సినిమాల కోసం 50 కోట్ల వరకూ ఛార్జ్ చేశారట. కానీ పెద్ది కోసం మాత్రం… అదనంగా మరో 50 కోట్లు.. అంటే మొత్తంగా 100 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్టు టాక్. దేవర తర్వాత పెద్దితో తెలుగు ఆడియెన్స్ ను పలకరిస్తోన్న జాన్వీకి సుమారు 6 కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కూడా ‘పెద్ది’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అతను 7 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక రామ్ చరణ్ తర్వాత అత్యధిక పారితోషికం డైరెక్టర్ బుచ్చిబాబుదే. పెద్ది సినిమాను డైరెక్ట్ చేసినందుకు ఆయన 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించిన జగపతిబాబు కు 5 కోట్లు, శివరాజ్ కుమార్ కు 10 కోట్లు పారితోషికం అందిందని టాక్. ఇక పెద్దికి సంగీతం సమకూర్చిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కు కూడా మైత్రీ వారు భారీగా పారితోషికం ఇస్తున్నట్టు వినికిడి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్

ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి మరీ సింగర్‌ను చంపేసిన వ్యక్తి

‘నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!’ హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

Follow Us