AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

‘నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!’ హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

Phani CH
|

Updated on: May 20, 2026 | 3:44 PM

Share

Jayam Ravi విడాకుల వివాదం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. భార్య ఆర్తి వేధింపులకు గురిచేసిందని ఆయన ఆరోపించగా, మూడు అక్షరాల నటి వల్ల తన జీవితం నాశనమైందని చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంలో Khushbu Sundar పేరు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఖుష్బు కూడా ఘాటుగా స్పందించింది.

కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన భార్య ఆర్తి తనను వేధింపులకు గురి చేసిందని మీడియాలో కన్నీళ్లు పెట్టుకున్నారు. విడాకులు మంజూరు అయ్యాకే తాను సినిమాల్లో నటిస్తానని తేల్చి చెప్పారు. మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత నరకం చూశానన్నాడు. ఇంట్లో కనీస గౌరవం ఇచ్చేవాళ్లు కాదని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బును దాచుకునేందుకు తనకంటూ ఒక అకౌంట్‌ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదని, తనపై చేతబడి చేయడంతో రక్తపు వాంతులు అవుతున్నాయన్నాడు. తాజాగా ఈ వివాదంలో అనూహ్యంగా నటి ఖుష్బు సుందర్ పేరు తెరపైకి వచ్చింది. మూడు అక్షరాల పేరుతో ఉన్న నటి వల్లే తన జీవితం నాశనమైందని జయం రవి ఆరోపించాడు. రవి ప్రస్తావించినట్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన మూడక్షరాల నటి ఖుష్బూ అని.. అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆమె పేరును తమిళంలో మూడు అక్షరాలతో రాస్తారు. అందుకే తనపై అరవగడ్డపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈక్రమంలోనే తనపై వస్తున్న విమర్శలపై కూష్బూ రియాక్ట్ ‍అయింది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై నటి ఖుష్బు సుందర్ స్పందించింది. జయం రవి పేరు నేరుగా ప్రస్తావించకుండానే పోస్ట్ చేసింది. కొందరు తమ డీఎన్ఏను నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారని విమర్శించింది. నేను చెప్పింది నిజమని నిరూపించినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఖుష్బు సుందర్. జయం రవి విడాకుల కేసు కాస్తా ఖుష్బు వర్సెస్ జయం రవిగా మారిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ

రైలు దూసుకొచ్చినా విడిచిపెట్టలేదు.. పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి

ముందే రుతుపవనాలు.. కానీ ‘ఎల్ నినో’ గండం!

10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్‌లో 720కి 107 మార్కులే !! బయటపడిన భారీ స్కామ్

అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని! వైరల్ అయిన ఉద్యోగిని వీడియో

Follow Us