AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20లక్షల కోసం.. హీరోయిన్‌ను చంపేసిన భర్త?

20లక్షల కోసం.. హీరోయిన్‌ను చంపేసిన భర్త?

Phani CH
|

Updated on: May 20, 2026 | 4:08 PM

Share

Twisha Sharma అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పెళ్లైన ఐదు నెలలకే భోపాల్‌లో ఆమె మృతదేహం లభించగా, ఇది వరకట్న వేధింపుల హత్య అని కుటుంబం ఆరోపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్, బలవంతపు అబార్షన్ ఆరోపణలు కేసును మరింత మిస్టీరియస్‌గా మార్చాయి. భర్త సమర్థ్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

నోయిడాకు చెందిన మోడల్, మాజీ మిస్ పూణే ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక ప్రేమకథ ఎలా హారర్ స్టోరీగా మారింది, ఆమె మరణానికి ముందు విడుదలైన సీసీటీవీ ఫుటేజ్ ఎలాంటి ప్రశ్నలను లేవనెత్తుతుందో తెలుసుకుందాం! ట్విషా శర్మ .. 33 ఏళ్ల నోయిడాకు చెందిన ఒక ప్రముఖ మోడల్, కార్పొరేట్ ప్రొఫెషనల్. 2024లో ఆమెకు ఒక డేటింగ్ యాప్ ద్వారా భోపాల్‌కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. సమర్థ్ తల్లి రిటైర్డ్ మేజిస్ట్రేట్ . ప్రేమకథగా మొదలైన వీరి బంధం, డిసెంబర్ 2025లో పెళ్లికి దారితీసింది. కానీ, ఈ పెళ్లి ఆమె జీవితానికి ఒక ఉచ్చులా మారుతుందని ఆమె ఊహించలేదు.పెళ్లయిన కేవలం 5 నెలలకే ఆమె జీవితం ముగిసింది. మే 12, 2026 మంగళవారం రాత్రి భోపాల్‌ కటారా హిల్స్‌లోని అత్తింట్లో ట్విషా ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించింది. అత్తగారి ఇల్లు దీనిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తుండగా, ట్విషా కుటుంబం ఇది పక్కా వరకట్న వేధింపుల హత్య అని ఆరోపిస్తోంది. మే 12 రాత్రి 10:05 గంటలకు ట్విషా తన తల్లికి ఫోన్ చేసి ఏడుస్తూ తన వేధింపుల గురించి చెప్పింది. అప్పుడే రూమ్‌లోకి భర్త సమర్థ్ రావడంతో భయంతో ఫోన్ కట్ చేసింది.కంగారుపడిన తల్లిదండ్రులు తిరిగి ట్విషాకి ఫోన్ చేయగా ఎవరూ ఎత్తలేదు. రాత్రి 10:20 అత్తగారి నుంచి ఫోన్ వచ్చింది.. “ట్విషా ఊపిరి పీల్చడం లేదని. కేవలం 15 నిమిషాల్లోనే అంతా అయిపోయింది. ఇక తాజాగా విడుదలైన సీసీటీవీ విజువల్స్ ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపుగా మారాయి. రెండు వేర్వేరు వీడియోలు బయటకు వచ్చాయి. మొదటి వీడియో లో ట్విషా శర్మ ఒంటరిగా బిల్డింగ్ మెట్లు ఎక్కుతూ టెర్రస్ వైపు వెళ్తున్నట్లు కేవలం 10 సెకన్ల క్లిప్‌లో కనిపిస్తోంది.రెండవ వీడియోలో.. దాదాపు గంట తర్వాత ట్విషా భర్త సమర్థ్, ఒక పక్కింటి వ్యక్తి అండ్ ఇంట్లోని పనిమనిషి ముగ్గురూ కలిసి ట్విషా మృతదేహాన్ని మెట్లపై నుంచి కిందకు మోసుకొస్తున్నారు. ఆ సమయంలో మెట్లపైనే ఆమెకు CPR చేస్తూ బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నట్లు విజువల్స్ లో కనిపిస్తోంది. ఇక మరణానికి కొన్ని రోజుల ముందు ట్విషా తన స్నేహితురాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో “నేను ఒక పెద్ద ట్రాప్‌ లో చిక్కుకున్నాను, నువ్వు జాగ్రత్త” అంటూ మెసేజ్ చేసింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ట్విషా శరీరంపై, మెడపై పాత గాయాలు ఉన్నట్లు తేలింది. అంతేకాదు, మరణించడానికి వారం రోజుల ముందే ఆమె గర్భాన్ని బలవంతంగా తీసివేయించారని , ఫోర్స్డ్ అబార్షన్ చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె పేరిట ఉన్న రూ. 20 లక్షల FD ని తన పేరు మీదకు మార్చాలని భర్త వేధించినట్లు సమాచారం. ట్విషా మరణానికి కారణమైన భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్‌లపై పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద కేసులు నమోదు చేశారు. అత్తకు బెయిల్ రాగా, భర్త సమర్థ్ బెయిల్ పిటిషన్‌ను భోపాల్ కోర్టు తిరస్కరించింది. ఒక ఉన్నత కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన ఒక మోడల్ జీవితం.. ఐదు నెలలకే అనుమానాస్పద స్థితిలో ముగిసిపోవడం తీవ్ర కలకలం రేపుతోందిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

Peddi: అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..

నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్

ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి మరీ సింగర్‌ను చంపేసిన వ్యక్తి

‘నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!’ హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

Follow Us