మండే ఎండల్లోనూ ఆగని సినిమా షూటింగ్స్
భారీ ఎండలు ఉన్నా టాలీవుడ్ హీరోలు మాత్రం షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి అల్లు అర్జున్ ‘రాకా’, మహేష్ సినిమా వరకు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ వివిధ లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. హెలో నేటివ్ స్టూడియో, RFC, కేరళ, ముంబై వంటి ప్రాంతాల్లో వరుసగా చిత్రీకరణలు కొనసాగుతున్నాయి. మరోవైపు చిరంజీవి-బాబీ సినిమా ఓపెనింగ్‌కు కూడా రంగం సిద్ధమైంది.
మండే ఎండలు మనల్ని ఆపలేవు అంటున్నారు మన హీరోలు. అందుకే పీక్ సమ్మర్‌లోనూ షూటింగ్స్‌తో పిచ్చెక్కిస్తున్నారు. చిరంజీవి లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే.. అందరూ లొకేషన్‌లోనే బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా సెట్స్‌లోనే ఉన్నారు. సీనియర్ హీరోలు సైతం నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెంచేసారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా..ముందు హెలో నేటివ్ స్టూడియోలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రభాస్ ఫౌజీ షూటింగ్ ముచ్చింతల్లోనే జరుగుతుంది. అలాగే నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ప్యారడైజ్.. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ఇరుముడి.. ప్రశాంత్ వర్మ అధీరా.. శర్వానంద్ భోగి లాంటి సినిమాల షూటింగ్స్ అన్నీ హెలో నేటివ్ స్టూడియోలోనే జరుగుతున్నాయి. ఫౌజీ ముచ్చింతల్లో జరుగుతుంటే.. స్పిరిట్ షూటింగ్ కొంపల్లిలో జరుగుతుంది. అల్లు అర్జున్ రాకా షూటింగ్ ముంబైలో బిజీ బిజీగా జరుగుతుంది. మహేష్ వారణాసి షూటింగ్ శంషాబాద్ తాహెర్ స్టూడియోలో జరుగుతుండగా.. ఎన్టీఆర్, నీల్ సినిమా షూటింగ్ RFCలో జరుగుతుంది. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న మైసా షూటింగ్ కేరళలో జరుగుతుంది. అక్కడే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు మేకర్స్. శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు షూటింగ్ శంకరపల్లిలోనే రెండు వారాలుగా జరుగుతుంది. మే 21న చిరంజీవి, బాబీ సినిమా ఓపెనింగ్ జరగనుంది.. రెగ్యులర్ షూట్ త్వరగానే మొదలు కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
MS Dhoni: రిటైర్మెంట్‌పై ధోనీ.. హింట్ ఇచ్చినట్లేనా?
Jayam Ravi: భార్య VS లవర్! దెబ్బకు పిచ్చోడిలా తయారైన స్టార్ హీరో
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

