AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash: ఆ స్టార్ హీరోపై అభిమానుల అసంతృప్తి

Yash: ఆ స్టార్ హీరోపై అభిమానుల అసంతృప్తి

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 20, 2026 | 7:01 PM

Share

‘కేజీఎఫ్’ తర్వాత యశ్ తీసుకుంటున్న భారీ గ్యాప్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ‘టాక్సిక్’ సినిమా వరుసగా వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్‌లో అసహనం పెరుగుతోంది. అయితే హాలీవుడ్ స్టైల్‌లో ముందుగా షూటింగ్, డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేసి తర్వాతే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తామని యశ్ చెబుతున్నారు. మరోవైపు ‘రామాయణ’ ప్రాజెక్ట్‌తో కూడా బిజీగా ఉన్న రాకింగ్ స్టార్‌పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి.

యశ్ పద్దతి అభిమానులకు నచ్చుతుందా..? అదేంటలా అడుగుతున్నారు.. వాళ్ళ హీరో వాళ్లకు నచ్చకుండా ఉంటాడా చెప్పండి అనుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే యశ్ తీరు ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చట్లేదు. ఇండియాను షేక్ చేసాక నాలుగేళ్లుగా కనిపించట్లేదీయన.. పైగా టాక్సిక్ రిలీజ్‌ ఇప్పట్లో ఉండదంటున్నారు. అసలు యశ్ ప్లాన్ ఏంటి.. ఆయన తీరుపై ఫ్యాన్స్ ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారు..? కేజియఫ్‌తో బాక్సాపీస్ కా సుల్తాన్ అయ్యాక.. నాలుగేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నారు యశ్. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నపుడు ఇంత గ్యాప్ మంచిది కాదని ఎంతమంది చెప్పినా.. తన ప్లాన్ తనకుంది అంటున్నారీయన. టాక్సిక్ డేట్ డిలే అవుతున్న కొద్దీ ఫ్యాన్స్‌లో కంగారు పెరుగుతుంటే.. యశ్ మాత్రం అస్సలు టెన్షన్ పడొద్దని భరోసా ఇస్తున్నారు.. అదంతా హాలీవుడ్ స్టైల్ అంటున్నారు. టాక్సిక్ సినిమాను ముందు మార్చి 19న విడుదల చేస్తామన్నారు.. ఆ తర్వాత యుద్ధం కారణంగా చూపించి జూన్ 4న విడుదలన్నారు. తీరా ఈ మధ్యే అది కూడా తూచ్ అన్నారు యశ్. అడిగితే హాలీవుడ్ పద్దతులు ఇలాగే ఉంటాయి.. ముందు షూటింగ్ అయిపోవాలి.. తర్వాత డిస్ట్రిబ్యూషన్ పూర్తవ్వాలి.. ఆ తర్వాతే రిలీజ్ గురించి ఆలోచిస్తాం అంటున్నారు రాకింగ్ స్టార్. టాక్సిక్ రిలీజ్ ప్రాసెస్ అభిమానులకు నచ్చకపోవచ్చని.. కానీ ఏం చేసినా వాళ్ల కోసమే అంటున్నారు యశ్. దీంతో పాటు రామాయణలోనూ నటిస్తున్నారు ఈ హీరో. దీవాళి 2026కి రామాయణ పార్ట్ 1 విడుదల కానుంది.. టాక్సిక్ ఈ ఏడాది రావడం కష్టమే. మొత్తానికి చేతిలో సినిమాలున్నా.. హాలీవుడ్ ప్రాసెస్ అంటూ నిదానంగా రంగంలోకి దిగుతున్నారు ఈ హీరో.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MS Dhoni: రిటైర్మెంట్‌‌పై ధోనీ.. హింట్‌ ఇచ్చినట్లేనా?

Jayam Ravi: భార్య VS లవర్‌! దెబ్బకు పిచ్చోడిలా తయారైన స్టార్ హీరో

20లక్షల కోసం.. హీరోయిన్‌ను చంపేసిన భర్త?

పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

Peddi: అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..

Follow Us