లోపం ఎక్కడుంది.. దర్శకుల్లోనా.. కథల్లోనా
టాలీవుడ్‌లో స్టార్ దర్శకుల మధ్య భారీ గ్యాప్‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఒక సినిమా విడుదలైన తర్వాత మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికే రెండుమూడేళ్లు తీసుకుంటుండటంతో హీరోల కెరీర్‌పైనా ప్రభావం పడుతోంది. రాజమౌళి, సుకుమార్, శేఖర్ కమ్ముల నుంచి త్రివిక్రమ్ వరకు చాలా మంది దర్శకులు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఈ లాంగ్ గ్యాప్‌లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదెక్కడి గ్యాప్ సామీ.. లిట్రల్‌గా టాలీవుడ్‌లో మన దర్శకులు తీసుకుంటున్న గ్యాప్ చూసి అభిమానులే అంటున్న మాట ఇది. సినిమా సినిమాకు రెండేళ్లు గ్యాప్ తీసుకుంటే ఓకే కానీ.. ఓ సినిమా విడుదలయ్యాక మరో సినిమా మొదలుపెట్టడానికే రెండు మూడేళ్లకు పైగా టైమ్ తీసుకుంటేనే అసలు సమస్య. ఈ భారీ గ్యాప్‌తో హీరోలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి ఈ గ్యాప్‌పై ఎక్స్‌క్లూజివ్ స్టోరీ చూద్దామా..? ఒకప్పుడు అగ్ర దర్శకులు ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేసేవాళ్లు. ఆ తర్వాత మేకింగ్ మారింది.. బడ్జెట్ పెరిగింది కాబట్టి రెండేళ్లకో సినిమా అయినా కూడా ఓకే అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఓ సినిమా విడుదలయ్యాక.. నెక్ట్స్ సినిమాకు పూజ చేయడానికే రెండు మూడేళ్లు తీసుకుంటున్నారు మన దర్శకులు. రాజమౌళి నుంచి సుకుమార్ వరకు అందరిదీ ఇదే దారి. సుకుమార్‌నే తీసుకోండి.. 2024 డిసెంబర్‌లో పుష్ప 2 విడుదలైంది.. రెండేళ్లవుతున్నా మరో సినిమా ఇంకా మొదలేపెట్టలేదు సుక్కు. చరణ్‌తో సినిమా ఓకే అయినా .. హీరో బిజీ కారణంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌లోనే ఉంది. ఆ మధ్య రాజమౌళి కూడా అంతే.. ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్.. వారణాసి పూజా డేట్‌కు మధ్యలో అక్షరాలా మూడేళ్లకు పైగానే గ్యాప్ ఉంది. శేఖర్ కమ్ముల కూడా ఇదే దారిలో నడుస్తుంటారు. ఓ సినిమా విడుదలై.. అది అయిపోయాక ఏడాదికి పైగానే ఆలోచించి.. మరో ఏడాది స్టోరీ రాసి.. అప్పుడు కానీ ముహూర్తం పెట్టరీయన. అందుకే గత పదేళ్లలో కమ్ముల నుంచి ఫిదా, లవ్ స్టోరీ, కుబేరా మాత్రమే వచ్చాయి.. మరో మూడేళ్లకు గానీ ఈయన నుంచి సినిమా రావడం కష్టమే. ఇక్కడ విచిత్రమేంటంటే ఈ దర్శకుల్ని చూసి పూరీ జగన్నాథ్ లాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ డైరెక్టర్స్ కూడా స్లో అయిపోయారు. డబుల్ ఇస్మార్ట్ వచ్చి రెండేళ్లైనా మరో సినిమా రిలీజ్ చేయలేదు పూరీ. ఏడాదికి కనీసం ఓ సినిమా చేసే త్రివిక్రమ్ స్లో అయిపోయారు.. వంశీ పైడిపల్లి 4 ఏళ్లకు పైనే గ్యాప్ ఇచ్చి.. ఈ మధ్యే సల్మాన్ సినిమా షురూ చేసారు. డైరెక్టర్స్ గ్యాప్ తగ్గిస్తేనే.. హీరోల గ్యాప్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
MS Dhoni: రిటైర్మెంట్‌పై ధోనీ.. హింట్ ఇచ్చినట్లేనా?
Jayam Ravi: భార్య VS లవర్! దెబ్బకు పిచ్చోడిలా తయారైన స్టార్ హీరో
20లక్షల కోసం.. హీరోయిన్‌ను చంపేసిన భర్త?
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
Peddi: అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

