ఉచిత విద్య, వసతి, భోజనం.. వేద విద్యపై ఆసక్తి ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్..! టీటీడీ ప్రవేశాలు ప్రారంభం
TTD Vedic University Admissions 2026: శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం (SVVU) 2026-27 విద్యా సంవత్సరానికి వేద, ఆగమ కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. 5వ లేదా 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 31వ తేదీలోగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం, అర్హతలు, దరఖాస్తు విధానం కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Tirumala Tirupati Devasthanam: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ వేద, ఆగమ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. వేద విద్యపై ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.
ప్రవేశాలకు ముఖ్య అర్హతలు
సాంప్రదాయ వేద కోర్సుల్లో చేరదలచిన అభ్యర్థులు తమ వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయన సంస్కారం పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన విద్యార్థులకు టీటీడీ, విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు కల్పించబడతాయి.
అందుబాటులో ఉన్న కోర్సులు
విశ్వవిద్యాలయం క్రింది విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ మరియు సర్టిఫికేట్ కోర్సులను అందిస్తోంది:
- వేద విభాగాలు
- ఋగ్వేదం
- శుక్ల యజుర్వేదం
- కృష్ణ యజుర్వేదం
- సామవేదం
- అథర్వవేదం
- ఆగమాలు, శాస్త్రాలు
- వైఖానసాగమం
- పాంచరాత్రాగమం
- తంత్రసారాగమం కృష్ణ యజుర్వేద స్మార్తం పురోహిత్యం
ఇతర కోర్సులు
- దివ్య ప్రబంధం
- వాగమవాస్తు (ఆలయ నిర్మాణ శాస్త్రం)
దరఖాస్తు విధానం
పూరించిన దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ: మే 31, 2026 అభ్యర్థులు TTD అధికారిక వెబ్‌సైట్ లేదా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ ప్రవేశ ప్రక్రియ. పూరించిన దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన ధ్రువపత్రాల ప్రతులను సంబంధిత జిల్లా ఎస్.వి. వేద విజ్ఞాన పీఠం చిరునామాకు రిజిస్టర్డ్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి.
విద్యార్హతలు, వయోపరిమితి
- అభ్యర్థులు కనీసం 5వ లేదా 7వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి.
- ఉన్నత కోర్సులకు సంబంధిత విద్యార్హతలు అవసరం.
వయోపరిమితి
- 5వ తరగతి అభ్యర్థులు: జూలై 1, 2014 నుంచి జూన్ 30, 2016 మధ్య జన్మించి ఉండాలి.
- 7వ తరగతి అభ్యర్థులు: జూలై 1, 2012 నుంచి జూన్ 30, 2014 మధ్య జన్మించి ఉండాలి.
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ల నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతో నింపి అవసరమైన పత్రాలతో కలిసి మే 31, 2026లోగా పోస్టు ద్వారా సమర్పించాలని విశ్వవిద్యాలయం సూచించింది.
సమర్పణ విధానం:
ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ ప్రక్రియ , పూరించిన దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన సర్టిఫికేట్ల కాపీలను సంబంధిత జిల్లాలోని (ధర్మగిరి-తిరుమల, కోటప్పకొండ, ఐ. భీమవరం, విజయనగరం, కీసరగుట్ట-మేడ్చల్, నల్గొండ) ఎస్.వి. వేద విజ్ఞాన పీఠం చిరునామాకు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి.
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org లేదా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ svvedicuniversity ద్వారా ప్రవేశం కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి .
