AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega 158: పవన్ కల్యాణ్ క్లాప్‌తో మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్

ఈ ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు తో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమాను ప్రారంభించారు. తనకు వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీతో మరోసారి జత కట్టారు మెగాస్టార్. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

Mega 158: పవన్ కల్యాణ్ క్లాప్‌తో మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
Mega 158 Movie
Basha Shek
|

Updated on: May 21, 2026 | 3:11 PM

Share

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ సంచలనాత్మక మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ద్వయం మరో భారీ ప్రాజెక్ట్‌ – #చిరుబాబీ2 / #చిరు158 తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పలు భారీ ప్రాజెక్టులను అందించిన తర్వాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ వారి తొలి తెలుగు చిత్రం ఇది. ఇప్పటికే వరుస అప్డేట్స్‌తో భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రం గురువారం (మే 21) ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమం మరింత వైభవంగా మారింది. ఈ మెగా త్రయం వేదికను పంచుకోవడం అభిమానులకు కనులవిందు చేసింది. పవన్ కళ్యాణ్ క్లాప్‌బోర్డ్ కొట్టగా, సుష్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వి.వి. వినాయక్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. బి. గోపాల్, కోదండరామి రెడ్డి, నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి లోహిత్ తన బృందంతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మాస్ ప్రేక్షకుల అభిరుచిని బాగా అర్థం చేసుకున్న దర్శకుడు బాబీ కొల్లి ఈసారి మరింత భారీ కథను సిద్ధం చేశారు. మ్యాసీవ్ స్కేల్, ఇంటెన్సిటీ తో నిండిన ఈ కథలో చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఆయన జిమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో ఈ సినిమా కోసం ఆయన ఎంత అంకితభావంతో సిద్ధమవుతున్నారో స్పష్టం చేసింది. ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆమె కూడా హాజరైంది.

ఇవి కూడా చదవండి

#ChiruBobby2 కోసం టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సంగీత సంచలనం ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ విజువల్స్‌ను అద్భుతంగా ఆవిష్కరించనున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాశ్ కొల్లా, ఎడిటర్‌గా ఆంటోని రూబెన్ పని చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఎడిషనల్ స్క్రీన్‌ప్లే రైటర్లుగా పనిచేస్తున్నారు. హిలేరియస్ రైటింగ్ తో పొందిన భాను-నందు ద్వయం ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

మెగా 158 పూజా కార్యక్రమాల్లో అనస్వర రాజన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే