OTT Movie: చేతబడితో ఊరిలో వరుస మరణాలు.. OTTలో మతిపోగొట్టే తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలో టాప్ రేటింగ్
హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ జానర్‌లో ఓ మంచి సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ తెలుగు సినిమా బెస్ట్ ఆప్షన్. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎంతో థ్రిల్లింగ్ గా, ఊహించని ట్విస్టులతో సాగే ఈ మూవీ కచ్చితంగా మిమ్మల్ని భయపెడుతుంది.

క్షుద్రపూజలు, చేతబడులు, మూఢ నమ్మకాలు నేపథ్యంలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఓటీటీలు స్టార్టయ్యాక ఈ జానర్ సినిమాలకు మరింత ఆదరణ పెరిగింది. ఏ భాషలో తెరకెక్కినా తెలుగులోకి కూడా అనువాదం అవుతున్నాయి. అయితే ఈ హారర్ థ్రిల్లర్ జానర్ లో ఓ తెలుగు సినిమానే ట్రెండ్ క్రియేట్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. ఒకటి కాదు రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమాకు అటు థియేటర్, ఇటు ఓటీటీలోనూ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. స్టోరీ విషయానికి వస్తే.. తెలంగాణలోని ఓ మారుమూల పల్లె. అక్కడ ఓ ఆటో డ్రైవర్ తన భార్య, పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంటాడు. పక్కనే అతని స్నేహితుడి ఫ్యామిలీ కూడా ఉంటుంది. అయితే ఉన్నట్లుండి ఆ మారుమూల పల్లెలో అనుకోని ఘటనలు జరుగుతాయి. అనుమానాస్పద మరణాలు చోటు చేసుకుంటాయి. మొదట ఆ ఊరి ప్రెసిడెంట్ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ తర్వాత మరో ఇద్దరు కూడా ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోతారు. అందులో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఊరిలో వరుస మరణాలకు క్షుద్ర పూజలు, చేతబడే కారణమని
ఇదే టైంలో ఆ ఊరిలో ఓ అమ్మాయి అనారోగ్యంతో చనిపోతుంది. దీనికి క్షుద్రపూజలు, చేతబడే కారణమని ఆ ఊరి పూజారి చెబుతాడు. ఇంతలో ఓ అమ్మాయి శవం దగ్గర పూజ చేస్తూ ఓ వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతాడు. దీంతో అతనిని అదే చితిపై పెట్టి అమ్మాయి కుటుంబ సభ్యులు చంపేస్తారు. మరి ఆ చేతబడులు చేసిందెవరు? ఆటో డ్రైవర్ కుటుంబానికి వాటితో ఉన్న సంబంధమేంటి? అసలు ఊరిలో చావులకు కారణమేంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
హారర్ థ్రిల్లర్ జానర్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ మూవీ పేరు మూ ఊరి పొలిమేర. సత్యం రాజేష్, గెటప్ శ్రీను, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య కీలకపాత్రల్లో నటించారు. మొత్తం రెండు పార్టులుగా ఈ మూవీ వచ్చింది. ఫస్ట్ పార్ట్ ‘ఆహా’లో ఉండగా రెండో పార్ట్ ‘జియో హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
మొత్తం రెండు పార్టులుగా మా ఊరి పొలిమేర..
MAA OORI POLIMERA(2021) is a highly engaging investigative thriller set in a caste-oppressed village where black magic is heavily practiced.
The story follows Komari, a hardworking auto driver who deeply cares for his family and the people around him. When he is suddenly… pic.twitter.com/ve3ff30SBs
— H.A.L. 9000 (@tamilhollywood2) April 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




