AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో పెద్దోడు, చిన్నోడు అసలు పేర్లేంటో తెలుసా? ఇన్నాళ్లకు బయటపడిన నిజం

టాలీవుడ్‌లో క్లాసిక్ సినిమాల లిస్ట్‌ తీస్తే అందులో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ఖచ్చితంగా ఉంటుంది. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ అయితే ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో పెద్దోడు, చిన్నోడు అసలు పేర్లేంటో తెలుసా? ఇన్నాళ్లకు బయటపడిన నిజం
Seethamma Vakitlo Sirimalle Chettu movie
Basha Shek
|

Updated on: May 19, 2026 | 5:55 PM

Share

తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాల్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఒకటి. అసలు తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు గట్టి పునాది వేసింది ఈ సినిమానే అని చెప్పవచ్చు. 2013లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ఇద్దరు కమర్షియల్ హీరోలను అన్నదమ్ముళ్లుగా పెట్టి ఎలాంటి ఫైట్స్, ఎలివేషన్స్, మసాలా సీన్లు, స్పెషల్ సాంగ్స్ గట్రా లేకుండా కూడా బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు అని ఈ సినిమాతో నిరూపించాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తుంటే కళ్లార్పకుండా చూసే వారు చాలా మంది ఉన్నారు. ఈ మల్టీస్టారర్ మూవీలో వెంకీ, మహేష్ లతో పాటు అంజలి, సమంత, జయసుధ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, అభినయ, రమాప్రభ, తణికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్, రవిబాబు, మురళి మోహన్ వంటి ఎందరో స్టార్స్ నటించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సినిమాలో మనకు స్టార్స్ కనిపించరు. కేవలం వారి క్యారక్టర్లే కనిపిస్తుంటాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్‌ల అసలు పేర్లేంటో ఎవరికీ తెలియదు. సినిమాలో వీళ్లను అందరూ పెద్దోడు, చిన్నోడు అని మాత్రమే పిలుస్తుంటారు. దీంతో వెంకీ, మహేష్ ల పేర్లు ఏంటి? అన్న డౌట్ చాలామందిలో అలాగే ఉండిపోయింది. దీనిపై డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో పెద్దోడు అలియాస్ వెంకటేష్‌కు మల్లికార్జున్ అనే పేరు అనుకున్నారట. అలాగే చిన్నోడు అలియాస్ మహేష్ బాబుకు సీతా రామరాజు అని పేరు అనుకున్నాడట శ్రీకాంత్ అడ్డాల. కాగా ఈ సినిమాలో అంజలి సీత అనే కీలక పాత్రలో నటించింది. సినిమా చివర్లో వెంకటేష్ సీతను పెళ్లి చేసుకుంటాడు. మల్లికార్జున్‌తో సీత వివాహం అంటే బాగుండదని ఈ పేర్లు వద్దనుకున్నాడట.

మరోసారి వెంకటేష్, మహేష్ బాబులకు వీరిద్దరికి రాముడు, లక్ష్మణుడు అనే పేర్లు పెడదాం అని కూడా అనుకున్నాడట శ్రీకాంత్ అడ్డాల. అయితే ఇంత కన్ఫ్యూజన్ ఎందుకని.. అసలు సినిమాలో వీరి పేర్లు వినిపించకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాడట డైరెక్టర్. అందులో భాగంగానే వెంకీ, మహేష్ లకు పెద్దోడు, చిన్నోడు అని పేర్లు పెట్టారట. అలా మొత్తానికి వీరి అసలు పేర్లు అవసరం లేకుండానే సినిమాను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా